నాగ చైతన్యపై అదిరిపోయిన సమంత రివేంజ్.. స్టార్ దర్శకుడుతో నిశ్చితార్థం..?
నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థంతో హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య , సమంత కాంబినేషన్‌లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఏం మాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య, మజిలి వంటి సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.
ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత ఒంటరికి ఉంటున్నారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు.ఈక్రమంలోనే సైలెంట్‌తో శోభితతో ఆగస్టు 8న నిశ్చితార్ధం చేసుకున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది.

నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత మౌనం వహిస్తున్నారు.అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.సమంత ఓ స్టార్ దర్శకుడుతో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ స్టార్ దర్శకుడు మరెవ్వరో కాదు.. రాజు నిడుమోరు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు . రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది.

త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సమంత ప్రస్తుతం నటిస్తోన్న సిటాడెల్ సినిమాకు సైతం రాజు నిడుమోరునే దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి సరైన బుద్ధి చెప్పిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.మరీ ఈ వార్తలో ఎంతవరకు వాస్తవమో తెలియదు. ప్రస్తుతం సమంత-రాజు నిడుమోరు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications