చైతూ 'మనీ'తో కొడితే.. సామ్ 'మార్క్స్' తో కొట్టిందా..? షాకింగ్ పోస్ట్

సాధారంణంగా చిన్నప్పుడు ఎవరైనా డాక్టరో, ఇంజనీరో కావాలనే కలల కంటారు. చాలా తక్కువ మంది మాత్రమే సెలబ్రిటీ కావాలని డ్రీమ్ పెట్టుకుంటారు. కానీ పెద్దయ్యాక వారి గమ్యాలు మారిపోతాయి. ఇప్పటికీ డాక్టర్ అవ్వాల్సిన వాన్ని.. లేదా ఏదో ఉద్యోగం సాధించాల్సిన వాడ్ని యాక్టర్ అయ్యానని చాలామంది చెబుతుంటారు. అలా సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో తెలియదు. అయితే అందం, చదువు కాంబినేషన్ ఒకే దగ్గర ఉండవని అనుకుంటారు. కానీ కొన్ని సార్లు ఈ ఫార్ములా రాంగ్ అవుతుంది కూడా.

ఇక హీరోయిన్స్, హీరోల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి వారి వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంటారు అభిమానులు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతకూ ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. అవును ఆమె టెన్త్ మార్కుల మెమో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మొన్నటి వరకూ టాలీవుడ్ ను ఏలింది సమంత. ఏమాయ చేశావే తో ఎంట్రీ ఇచ్చి బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, రంగస్థలం లాంటి టాలీవుడ్ ను దాదాపు 10 ఏళ్లపాటు శాసించింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. అలా తెలుగులోనే కాదు తమిళ్ లోనూ ఈ అమ్మడు తన సత్తా చాటుకుంది. హిందీలోనూ సినిమాలు చేసింది.

ఆ తర్వాత సమంత, నాగ చైతన్య వివాహం జరిగింది. అనంతరం ఈ జంట కొన్ని కారణాల వల్ల విడిపోయింది. ఆ తర్వాత సమంత మాయోసైటిస్ బారిన పడి ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం సినిమాల్లో బిజీ కావాలని చూస్తుంది. ఈ ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ గా మారింది. ఇటీవల శుభం అనే సినిమా నిర్మించింది. అలాగే ఈ సినిమాలో చిన్న పాత్రలోనూ కనిపించింది. ఈ క్రమంలో ఆమె 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Samantha s Class 10 Marksheet Goes Viral Showcases Stellar Academic Record

అయితే అక్కినేని నాగచైతన్య కంటే సమంత కే మార్కులు ఎక్కువ అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు. చైతూ కూడా మార్క్స్ లిస్ట్ ను ప్రకటించాలని సామ్ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+