నాగ చైతన్యకు సర్వస్వం ఇచ్చాను..గుట్టు విప్పిన సమంత
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేసుకుంటున్నారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. నాగ చైతన్య తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నారు. వీరిద్దరు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లితో ఒకటి కాబోతున్నారు. అటు సమంత మాత్రం సింగిల్‌గానే ఉంది.

కొంతకాలం అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత , ఆరోగ్యం కోలుకోవడంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ 'సిటాడెల్ (హనీ, బన్నీ)' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా , సమంతను హీరో వరుణ్ ధావన్ ఇంటర్య్వూ చేశారు. ఈ సందర్భంగా సమంత పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Q) What’s the Most Ridiculous Amount of Money You’ve Spent on Something Completely Useless?
— Movies4u Official (@Movies4u_Officl) November 24, 2024
"My Ex's Expensive Gifts." - #Samantha pic.twitter.com/wejDN9uoEE
మీరు అత్యధికంగా దేని కోసం ఖర్చు చేశారు, దాని ఖరీదు ఎంత అని వరుణ్ ధావన్ సమంతను ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ..నా మాజీ భర్త నాగ చైతన్య కోసం ఖరీదైన కానుకులు ఇవ్వడంలో కాస్తా ఎక్కువగానే ఖర్చు చేశానని సమంత చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications