ఈ కుక్క ప్రేమకంటే ఏదీ గొప్పది కాదు: సమంత
తెలుగులో అగ్రస్థాయి కథానాయికగా చెలామణి అయిన సమంతకు ప్రస్తుతం సినిమాలు లేవు. మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు సినిమాలకు విరామం ఇవ్వడంతో ప్రస్తుతం సినిమా ఆఫర్లు ఏవీ రావడంలేదు. దీంతో వెబ్ సిరీస్ లు చేస్తోంది. తాజాగా చేసిన సిటాడెల్ రీమేక్ సిరీస్ హనీబన్నీ గత నెల 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారమవుతోంది. అత్యధిక వ్యూస్ సాధించడంతో సిరీస్ టీం సంబరాలు చేసుకుంది. ప్రస్తుతం మా ఇంటి బంగారం పేరుతో తెలుగులో సొంత బ్యానరుపై ఓ సినిమా, తర్వాత రక్తబ్రహ్మాండ్ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమవుతోంది. తరుచుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ చురుగ్గా ఉంటుంది.
ఏనాడూ ఒక్క మాట మాట్లాడని నాగచైతన్య
సమంత పెట్టే పోస్టులన్నీ నాగచైతన్యను పరోక్షంగా లక్ష్యంగా ఎంచుకొని పెట్టినట్లు ఉంటాయని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో ఆమె నాగచైతన్యను విమర్శించినట్లు అర్థమవుతుంటుంది. అయితే నాగచైతన్య మాత్రం ఏనాడూ స్పందించలేదు. సమంతకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. తాజాగా సామ్ పెట్టిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి వైరలవుతోంది. తను పెంచుకునే కుక్క కళ్లల్లోకి చూస్తూ ' నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు..' అని క్యాప్షన్ పెట్టి ఫొటోను షేర్ చేసింది.

సమంత ఏ ఫొటో పెట్టినా నాగచైతన్య గురించేనా?
సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఏ పోస్ట్ పెట్టినా, ఏ ఫొటో షేర్ చేసినా అది నాగచైతన్య గురించే అని అందరికీ అర్థమవుతోంది. ఆ ఫొటోలో కుక్క కళ్లల్లోకి చూస్తూ ఉంది. మరోవైపు నాగచైతన్య శోభిను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్న తరుణంలో సమంత ఫొటోకు, వాటికి ఏమైనా సంబంధం ఉందా? అని నెటిజన్లు చర్చ పెట్టారు. వాళ్లిద్దరినీ పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఈ ఫొటో పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నాగచైతన్య, శోభిత పెళ్లి అన్నపూర్ణ స్టూడియంలో ఘనంగా జరిగింది. 300 మంది అతిథులు హాజరయ్యారు. అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతోపాటు వారి బంధుమిత్రులు, సన్నిహితులు, రాజమౌళి, రాఘవేంద్రరావు, చిరంజీవి లాంటి ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం నాగార్జున, నాగచైతన్య, శోభిత కలిసి శ్రీశైలంలోని శ్రీమల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. తనకు ఎంతో సంతోషంగా ఉందని నాగార్జున ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు












Click it and Unblock the Notifications