అతన్ని వదిలి ఉండలేకపోతున్న సమంత..? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందిగా..!
గత కొంతకాలంగా సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన చర్చ సాగుతుంది. సమంత హీరో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
విడాకుల తర్వాత సమంత ఒంటరిగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే సమంత రెండో పెళ్లి గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోనని ఎక్కడా చెప్పడం లేదు. అయితే గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజు నిడుమోరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి ఆప్డేట్స్ ఇవ్వడం లేదు.
తాజాగా సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. సమంత తిరుపతి వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమెతోనే ఉన్నారు. ఇటీవలే సమంత తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. రాజు నిడుమోరు భుజంపై తాను వాలిన ఫొటోను సమంత పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరు పెళ్లి ఖాయమంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా సమంత , రాజు నిడుమోరు కలిసి మరోసారి దర్శనం ఇచ్చారు. సమంత తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది.
'హ్యాపీ వీకెండ్' అంటూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలతో పాటు ఫొటోలను సమంత పంచుకుంది. వాటిలో రాజ్ నిడిమోరు ఉన్నాడు. రాజ్‌తో కలిసి సమంత పికిల్ బాల్ ఆడుతూ సందడి చేసింది. కోర్టులో రాజ్, సమంత ఒకవైపే ఉండి ఆడటం వీడియోలో కనిపించింది. దీంతో రాజ్‌తో సమంత డేటింగ్ పక్కా అని నెటిజన్లు కన్ఫామ్ చేసేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ, ప్రస్తుతం సమంత-రాజు నిడుమోరు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications