దాని తర్వాతే జీవితంలో సంతోషంగా ఉన్నా.. అందుకు థాంక్స్: సమంత
దక్షిణాది బ్యూటీ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. నాగచైతన్యను వివాహం చేసుకున్నప్పటికన్నా విడిపోయిన తర్వాతే ఎక్కువ పేరును సంపాదించుకుంది. మయోసైటిస్ వ్యాధికి గురైతే చికిత్స కోసం ఏడాదిన్నర సమయం సినిమాలకు విరామం ప్రకటించింది. తాజాగా సొంత బ్యానరులతో మా ఇంటి బంగారం పేరుతో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేస్తోంది. దీంతోపాటు సిటాడెల్ రీమేక్ సిరీస్ హనీబన్నీ చేసింది. వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించాడు. దీని ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటోంది. ఈ నెల ఏడోతేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇంత సంతోషం అద్భుతం
ప్రస్తుతం రాజస్థాన్ లో వివిధ ప్రదేశాలను తిరిగి చూస్తున్న సమంత దీపావళి పండగను కూడా అక్కడే జరుపుకుంది. తాను ఎక్కడున్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు తన వివరాలను, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటుంది. ప్రస్తుతం ఫోర్ట్ బర్వరాలో ఉన్న సమంత అక్కడి ఉద్యోగులతో ఫొటోలు దిగింది. మట్టికుండను తయారుచేసే విధానానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. తన జీవితంలో ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఎప్పుడూ లేనని, ఇప్పుడు ఉన్నానని, నవంబరు నెల మొత్తం ఇంకా ఆనందంగా ఉంటానంది. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరా ఎంత అందంగా ఉందో, అంత అద్భుతమైన అనుభవాన్ని కూడా అందించిందని, అందుకు తాను బర్వరాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పోస్ట్ లో రాసింది.

హనీబన్నీకి పనికొస్తాయనే ఉద్దేశంతో
హనీబన్నీ వెబ్ సిరీస్ కు ప్రమోషన్స్ లా కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో తన ఫొటోలను, వివరాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది. ఇలా పోస్ట్ చేయడంద్వారా కూడా సమంతకు ఆదాయం వస్తుంది. రెండు సంవత్సరాల నుంచి సినిమా చేయనప్పటికీ ఇప్పటికీ తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. ఇటీవలే బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా ఇదే తేలిసింది. ప్రతిసారీ దాదాపుగా మొదటిస్థానాన్ని సమంతే ఆక్రమిస్తోంది. ఇటీవలే తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎంతో హుందాగా స్పందించింది. దీనిపై స్పందించిన సమంత మాట్లాడిన ప్రతి మాట చాలా అద్భుతంగా ఉందని, ఆచితూచి మంచి మాటలు రాసుకొచ్చిందని అందరూ కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications