సమంత షేక్ ఆడించింది..!

హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే'' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన ''దూకుడు'' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది.

టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తరువాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కొంతకాలం మయసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడ్డారు.

Samantha stuns in an ultra-modern look at a Mumbai event

దీంతో కొంతకాలం సినిమాలకు దూరం ఉన్న సమంత తిరిగి సినిమాల్లో నటించడంతో పాటు, నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇదే సమయంలో గత కొంతకాలంగా సమంత, దర్శకుడు రాజ్ నిడుమోరుల గురించి ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. వారు డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. సమంత, రాజ్ నిడుమోరు కలిసి 'ఫ్యామిలీ మ్యాన్', 'సిటాడెల్' వంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లకు పనిచేశారు.

'ఫ్యామిలీ మ్యాన్' సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో రాజ్ నిడుమోరుతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తోన్న సమంత, అతనితో ఉన్న బంధం గురించి మాత్రం నోరు విప్పడం లేదు.ఇదిలా ఉంటే సమంత తాజాగా తనదైన గ్లామర్ షోతో అదరగొట్టింది.

ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరైన సమంత గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. మంత తన అల్ట్రా-మోడ్రన్ లుక్‌తో ఆకట్టుకుంది. సమంత స్టన్నింగ్ లుక్స్ చూసి ఈవెంట్‌కు వచ్చిన అతిథులు, మీడియా ప్రతినిధులు ఆశ్చర్యానికి గురయ్యారు. డ్రెస్‌లో సమంతను చూసిన నెటిజన్లు "ఏజ్ పెరుగుతున్నా సమంత మరింత గ్లామరస్‌గా మారుతోంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+