అతనితో జంటగా దుబాయ్‌కి వెళ్లిన సమంత..ఫుల్ చీల్ అవుతున్నారుగా..!
గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో సమంత రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజు నిడుమోరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి ఆప్డేట్స్ ఇవ్వడం లేదు.

తాజాగా సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. సమంత తిరుపతి వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమెతోనే ఉన్నారు. ఇటీవలే సమంత తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. రాజు నిడుమోరు భుజంపై తాను వాలిన ఫొటోను సమంత పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరు పెళ్లి ఖాయమంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా సమంత , రాజు నిడుమోరు కలిసి మరోసారి దర్శనం ఇచ్చారు. సమంత తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది.
సమంత ప్రస్తుతం దుబాయ్‌లో వెకేషన్‌ను ఆస్వాదిస్తున్నారు. ఒక జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొనడానికి అక్కడికి వెళ్లిన సమంత, గత కొన్ని రోజులుగా అరబ్ దేశంలో విహరిస్తోంది. అక్కడి అందమైన లొకేషన్స్‌లో ఫొటోలకు ఫోజులిస్తూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సమంత షేర్ చేసిన ఓ ఫొటోలో సన్‌గ్లాసెస్ రిఫ్లెక్షన్‌లో రాజ్ నిడిమోరు కనిపిస్తున్నట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.సమంత తన వెకేషన్ ఫోటోలలో ఒక దానిలో ఒక వ్యక్తితో కలిసి కనిపించింది. అయితే, ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో నెటిజన్లు ఆ వ్యక్తి "రాజ్" అయి ఉండవచ్చునని ఊహిస్తున్నారు. దీంతో రాజ్‌తో సమంత డేటింగ్ పక్కా అని నెటిజన్లు కన్ఫామ్ చేసేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ, ప్రస్తుతం సమంత-రాజు నిడుమోరు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications