నాగచైతన్యపై రివెంజ్... అల్లు అర్జున్ కోసం సమంత మాస్టర్‌ప్లాన్
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం హనీబన్నీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దీనికోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఈనెల ఏడోతేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. పుష్ప1 సినిమాలో ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా అంటూ ఐటం సాంగ్ లో నటించి భారతదేశాన్ని ఊపేసింది. ఆ పాటలో సమంత చేసిన నృత్యం, ఆరబోసిన అందాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. ఆ సమయానికే నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. అతనిమీద కసితోనే ఆ పాటలో నటించిందని, అంతగా నటించిందని వార్తలు వచ్చాయి.
శ్రీలీలను సంప్రదించారంటున్నారు
ప్రస్తుతం పుష్ప2 సినిమాకు సంబంధించి ప్రత్యేక గీతంలో నటించేందుకు దర్శకుడు సుకుమార్ శ్రద్ధాకపూర్ చేత చేయిద్దామనుకున్నారు. చివరకు శ్రీలీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అకస్మాత్తుగా సమంత పేరు వినిపిస్తోంది. పుష్ప1 స్థాయిలో పాట రావాలంటే అదే స్థాయిలో నటించే, అదే స్థాయిలో నృత్యం చేసే సమంత అయితే బాగుంటుందనే అభిప్రాయానికి సుకుమార్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నాగచైతన్య శోభిత ధూళిపాళను వివాహం చేసుకోబోతున్నారు. అతనిపై ఈ పాటలో నటించడంద్వారా రివెంజ్ తీసుకున్నట్లవుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఎవరిచేత చేయిస్తారో?
శ్రీలీల చేత చేయిస్తారా? లేదంటే సమంత చేత చేయిస్తారా? అనేది తేలాల్సి ఉంది. కుర్రకారును పుష్ప1 సాంగ్ ఊపేసింది. సమంతే స్వయంగా ఈ పాట తాను చేస్తానని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనివల్ల నాగచైతన్యను మించిన క్రేజ్ తనకు మరోసారి వస్తుందని సామ్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పుష్ప1లో చేసిన తర్వాత తిరిగి పుష్ప2లో కూడా సమంతచేతే ఈ పాటను సుకుమార్ చేయిస్తాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది. శ్రీలీల డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. హీరోలు కూడా ఆమె పక్కన డ్యాన్స్ వేయలేరు. ఐటం సాంగ్ లో శ్రీలీల అయితే బాగుంటుందా? లేదంటే సమంత అయితే బాగుంటుందా? అనేది తేలాలంటే మరో వారం రోజులు ఓపిక పట్టాల్సి ఉంది.












Click it and Unblock the Notifications