నరకం అనుభవించా ..సంచలన విషయాలు బయటపెట్టిన సమంత

హీరోయిన్ సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత, తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది.ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి మధ్య తీవ్ర విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. ఆమె అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు.మయసైటీస్ వ్యాధి కారణంగా కొంతకాలం సమంత సినిమాలకు దూరంగా ఉన్నారు.మయసైటీస్ వ్యాధి నయం కావడంతో సమంత తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. అయితే ఆమె కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి ఆమె దూరంగా ఉంటున్నారు.ఇక గత కొద్ది రోజులుగా హీరోయిన్ సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంది.

Samantha s sensational post on spirituality

ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. సమంత రెండో పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్‌ దర్శకుడు రాజు నిడుమోరుతో డేటింగ్ చేస్తోన్నట్టు ప్రచారం జరుగుతోంది.వీరిద్దరు చాలాకాలంగా ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.దీనిపై సమంత నోరు మెదపడం లేదు.

ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో సమంత తర్వాతే ఎవరైనా. తాజాగా సమంత అలాంటి పోస్ట్‌ను ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను తమిళనాడు.. కోయంబత్తూరులోని ఓ ఆధ్యాత్మిక సంస్థకు వెళ్లినట్లు తెలిపింది. అక్కడి పచ్చదనాన్ని పిక్చరైజ్ చేసిన సమంత.. సెషన్స్‌కి హాజరయ్యేందుకు తాను పొందిన ఐడీ కార్డును చూపించింది. 3 రోజులు సైలెంట్‌గా ఉన్నాను.అక్కడకు వెళ్లిన తర్వాత ఎవరితోనూ నాకు కమ్యూనికేషన్ లేదు.దీంతో నరకం అనుభవించానని ఈ భామ చెప్పుకొచ్చింది. అక్కడ నేను నాకులాగ బ్రతికాను.ఇలా లక్షసార్లు అయినా చేస్తా. ఇది మీ అందరికీ రికమెండ్ కూడా చేస్తా. ఒంటరితనం భయపెడుతుందని ఒప్పుకుంటూనే.. ఆమె దానిని మళ్లీ మళ్లీ ఇష్టంగా అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సీనియర్ బ్యూటీ పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+