'సమరసింహారెడ్డి', 'ఇంద్ర'.. ఈ రెండు ఇండస్ట్రీ హిట్స్‌లో ఏది బెస్ట్?
తెలుగు సినిమా చరిత్రలో 'సమరసింహారెడ్డి' కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఫ్యాక్షన్ జోనర్ ను ఈ సినిమా సృష్టించి రాచబాట వేస్తే.. మిగతావారంతా ఆ బాటలో పయనించారు. సమరసింహారెడ్డిగా నందమూరి బాలకృష్ణ ఆ పాత్రలో జీవించడమేకాదు.. ఫ్యాక్షనిస్టు అంటే తలలు నరకడమే కాదు.. మంచి కోసం అవసరమైతే తలను కూడా అర్పిస్తాడని నిరూపించారు. రాయలసీమ నేపథ్యంలో ఇలాంటి కథలతో సినిమాలు తీయొచ్చని నిరూపించిన తొలి సినిమా ఇది. ఈ సినిమా రాకపోయి ఉంటే, ఆ తర్వాత 'నరసింహ నాయుడు' గానీ, 'ఇంద్ర' గానీ వచ్చేవి కావు.
బాంబుల హోరు, బాలయ్య నడక
తెలుగు సినిమా చరిత్రలో బెస్ట్ యాక్షన్ సీన్లలో రైల్వే స్టేషన్ ఫైట్ ఒకటి. బాంబుల హోరు, బాలయ్య నడక, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సృష్టించిన ప్రభావాన్ని ఇంద్రోలోని ఏ సన్నివేశం అధిగమించలేకపోయింది. ఈ సినిమాలో కూడా మంచి సన్నివేశాలున్నాయి. మణిశర్మ 'ఇంద్ర'కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కానీ సమరసింహారెడ్డిలో ఆయన ఇచ్చిన బీజీఎం మాత్రం ఒక విప్లవం అని చెప్పొచ్చు. ఫ్యాక్షన్ హీరో ఎంట్రీ ఇస్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోవాలని మొదటిసారి ప్రేక్షకులకు రుచి చూపించింది ఈ సినిమానే. బీజీఎంలంటే ఎలా ఉండాలో ఈ సినిమా నుంచి సంగీత దర్శకులు నేర్చుకున్నారని చెప్పొచ్చు.

5 రెట్ల లాభాలు వచ్చాయి
'సమరసింహారెడ్డి' చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొంది, బాక్సాఫీస్ దగ్గర పెట్టిన పెట్టుబడికి ఐదు రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది. సమరసింహారెడ్డిలో హీరో క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. 'ఇంద్ర'లో మాత్రం హీరో పాత్రకు కొంచెం గ్లామర్, క్లాస్ టచ్ కనిపిస్తుంది. కానీ ఒక పూర్తి మాస్ హీరో ఎలా ఉండాలో బాలయ్య సమరసింహారెడ్డితో చూపించారు. 'ఇంద్ర' కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించి ఉండవచ్చు కానీ 'సమరసింహారెడ్డి' తెలుగు సినిమా గమనాన్ని మార్చిన సినిమా. ఫస్ట్ ఈజ్ ద ఫస్ట్ అంటారు. అలాగే మొదటిది మొదటిదే. ఈ సినిమాలో బాలయ్య గెటప్ తోపాటు నరసింహా..! అని అరవగానే వచ్చే సీన్ గుర్తు తెచ్చుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చివరగా ఇంద్ర మీద సమరసింహారెడ్డిదే పై చేయి అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications