డేటింగ్‌కు ఆమెను కూడా తోడు తెచ్చుకున్నాడు -ఎన్టీఆర్ మాజీ ప్రియురాలు

హీరోయిన్ సమీరారెడ్డి గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు, హిందీ సినిమాల్లో ఆమెకు సూపర్ క్రేజ్ ఉండేది.గతంలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి ప్రేమించుకున్నారనే వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సైతం ఓ ఇంటర్య్వూలో అంగీకరించారు. పెళ్లి చేసుకుందమనకునే సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ, వీరిద్దరు విడిపోయారు. సమీరా రెడ్డి తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తే.. రెండు సినిమాలు ఎన్టీఆర్‌తోనే నటించారు.

నరసింహుడు, అశోక్ సినిమాల్లో ఎన్టీఆర్‌తో నటించగా, చిరంజీవితో జై చిరంజీవా సినిమాలో నటించారు. ఎన్టీఆఱర్ సైతం సమీరా రెడ్డిపై తనకున్న క్రష్‌ను ఓ ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆమె సినిమాలో నటించకపోయినప్పటికీ ఆమెను మాత్రం ప్రేక్షకులు మరువలేదు. ఆ మధ్య సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె స్పందించారు.కెరీర్ తొలినాళ్లలో బ్రెస్ట్‌ గురించి విపరీతమైన చర్చ సాగేదని..ఆ సమయంలో చాలా మంది తనని సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారని చెబుతూ ఎమోషనల్ అయ్యింది.హీరోయిన్‌గా సినిమాలు చేసే సమయంలోనే శరీరంలో మార్పులు వచ్చాయి.ఆ సమయంలో అందరూ నన్ను బూబ్ జాబ్ సర్జరీ సర్జరీ చేయించుకోమని ఒత్తిడి తెచ్చారు.

Sameera Reddy about her dating and marriage

చాలా మంది చేయించుకుంటున్నారు నీకేమైంది అని నన్ను పదే పదే ఇబ్బంది పెట్టారు.నాకు అది ఇష్టం లేదు అని చెప్పినా వినేవారు కాదు.ఆ సమయంలో చాలా బాధపడ్డాను అని ఎమోషనల్ అయ్యింది. నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను.కానీ నా సమస్యను నేను పరిష్కరించుకోగలను అని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది. అయితే చాలా రోజుల క్రితమే సినిమాలు మానేసిన సమీరా రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమవుతుంది.భర్త, పిల్లలు, వారి చదువులకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. సమీరా రెడ్డి తాజాగా తన ప్రేమ పెళ్లి గురించి బయటపెట్టింది.

సమీరా రెడ్డి ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వర్ధేని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళికి ముందు తన భర్తతో ప్రేమ సంగతులని సమీరా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. పెళ్ళికి ముందు అక్షయ్, సమీరా కొంత కాలం డేటింగ్ చేశారట. మేమిద్దరం డేటింగ్‌కి వెళితే అక్షయ్ వాళ్ళ అమ్మని కూడా తీసుకువచ్చేవాడు. అమ్మ విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. కొన్నిసార్లు లేట్ అయితే రాత్రి వేళల్లో అక్షయ్ ఇంట్లోనే నిద్ర పోయేదాన్ని. వాళ్ళ అమ్మ పెళ్ళికి ముందే అక్షయ్‌తో నన్ను ఉండనిచ్చేది. అప్పటి నుంచి మా అత్తగారు నాకు సపోర్ట్ గా ఉంటున్నారు అని సమీరా రెడ్డి తెలిపింది.సమీరా రెడ్డి తన భర్త అక్షయ్ కంటే వయసులో రెండేళ్లు పెద్దది. బాలీవుడ్‌లో ఇప్పుడు వయసు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. సమీరా, అక్షయ్ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. దీంతో సమీరా రెడ్డి పెళ్లికి ముందు అక్షయ్‌తో డేటింగ్ చేసిందనే విషయాన్ని బయటపెట్టినట్టు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+