ఎన్టీఆర్‌పై సమీరా రెడ్డి ప్రశంసలు..పాత ప్రేమను గుర్తు చేసుకున్నారా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన , డ్యాన్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికి, అనతి కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ హీరోలను వణికించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. వరుస హిట్లను సాధిస్తూ స్టార్ హీరోగా మారారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టనుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌పై ఒకప్పటి హీరోయిన్ సమీరారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత సమీరారెడ్డి తెలుగు మీడియాతో ముచ్చటించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను గ్లోబల్ స్థాయిలో గుర్తింపు రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది.ఎన్టీఆర్ సినిమాల పాటలంటే చాలా ఇష్టమని, ఇప్పటికీ వింటుంటాము అని తెలిపింది.

అలాగే ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అంటే నాకు బాగా ఇష్టం మా పిల్లలు కూడా ఆ పాటను చాలా ఇష్టపడతారు.వారి ఫేవరెట్ సాంగ్ అదే అని ఆమె తెలిపింది. ఈ సినిమా పాటను ఇంకా ఇంట్లో పెట్టుకొని మరీ పిల్లలు డాన్స్ చేస్తూ ఉంటారని సమీరా రెడ్డి తెలిపింది.అలాగే అశోక్ సినిమాలో పాటలు అన్నా కూడా తనకు ఎంతో ఇష్టమని ఆమె తెలిపారు.గతంలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి ప్రేమించుకున్నారనే వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సైతం ఓ ఇంటర్య్వూలో అంగీకరించారు.
పెళ్లి చేసుకుందమనకునే సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ, వీరిద్దరు విడిపోయారు. సమీరా రెడ్డి తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తే.. రెండు సినిమాలు ఎన్టీఆర్‌తోనే నటించారు. నరసింహుడు, అశోక్ సినిమాల్లో ఎన్టీఆర్‌తో నటించగా, చిరంజీవితో జై చిరంజీవా సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలో నటించకపోయినప్పటికీ ఆమెను మాత్రం ప్రేక్షకులు మరువలేదు.అయితే చాలా రోజుల క్రితమే సినిమాలు మానేసిన సమీరా రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమవుతుంది.భర్త, పిల్లలు, వారి చదువులకే ప్రియారిటీ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications