జూనియర్ ఎన్టీఆర్ వల్ల కెరీర్ కోల్పోయిన హీరోయిన్
బి.గోపాల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు చిత్రం బ్లాక్ బస్టర్ ఫ్లాప్. భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది సమీరారెడ్డి. చిరంజీవితో కూడా నటించి మంచిపేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. సమీరారెడ్డి జూనియర్ ఎన్టీఆర్ తో ప్రేమలో ఉండటంవల్లే సినిమాను మానేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమీరారెడ్డి జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ఆయన చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషని, సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు తాను తారక్ దగ్గర నేర్చుకున్నట్లు చెప్పారు. దీంతో తమ ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి చాలామంది తామిద్దరి మధ్య అఫైర్ అంటకట్టారని, ఈ విషయంలో తాను తన తండ్రికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిందన్నారు. తమ బంధువులు కూడా ఈ రూమర్ నిజమేనా అని అడిగారని, అటువంటిదేమీ లేదని తాను చెప్పానన్నారు. ఆ సమయంలో తమ కుటుంబం ఎంతో ఇబ్బందికి గురైందన్నారు. కానీ తనకు, ఎన్టీఆర్ కు మధ్య ఎటువంటి రిలేషన్ లేదని స్పష్టతనిచ్చారు.

హరికృష్ణ వార్నింగ్
తారక్, సమీరారెడ్డి.. గతంలో ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారని, అప్పుడు హరికృష్ణ సమీరాకు వార్నింగ్ ఇవ్వడంతో ఆమె ఏకంగా తెలుగు సినీ పరిశ్రమకే గుడ్ బై చెప్పేసి పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైందంటూ వార్తలు వచ్చాయి.ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ వార్ 2 బాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీనికి డ్రాగన్ అని పేరు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి కానీ అధికారికంగా ధ్రువీకరణ రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications