ఓటీటీలో అదరగొడుతున్న కొత్త సినిమా..!
ఇటీవల కాలంలో ఓటీటీలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధారణ లభిస్తోంది. దీనిలో భాగంగానే ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ఆ సినిమానే 'సమ్మేళనం'.ఈ వెబ్ సిరీస్ నేరుగా ఓటీటీలోనే విడుదల అయింది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.రొమాంటిక్ డ్రామాగా రూపొందిన తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హుషారు ఫేం ప్రియా వడ్లమాని, గణాదిత్య, విఘ్నయ్ అభిషేక్, బిందు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ :
'సమ్మేళనం' అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా రూపొందించారు. తన కాలేజీ రోజుల్లోని స్నేహితుల జ్ఞాపకాలను, ప్రేమ తాలూకు అనుభూతులను పుస్తక రూపంలో భద్రపరుచుకుంటాడు ఓ యువకుడు. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆ స్నేహితులు దూరమవ్వాల్సి రావడం.. ఇలాంటి సమయంలో, అతను రాసిన ఆ పుస్తకం వారందరినీ మళ్లీ ఒకచోట చేర్చిందా? లేదా తెలియాలంటే 'సమ్మేళనం' వెబ్ సిరీస్‌ను చూడాల్సిందే.

విశ్లేషణ:
స్నేహం, ప్రేమ, అలాగే ఆ బంధాలలో చోటుచేసుకునే గందరగోళాన్ని ఆసక్తికరంగా ప్రస్తావించే ఈ వెబ్ సిరీస్ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంది. కొన్ని సీన్స్ రియాలిటీకి దగ్గరగా ఉండి ఆడియన్స్‌ని కథలో లీనం చేస్తున్నాయి. వెబ్ సిరీస్ అయినప్పటికీ అన్ని హంగులతో ఆకట్టుకుంటోంది.వెబ్ షో, ఓటీటీ అంటే బూతులు రాజ్యం ఏలుతున్న రోజుల్లో ఎటువంటి అశ్లీలతకు తావు లేకుండా సిరీస్ తీసినందుకు.. గీత దాటకుండా సిరీస్ అయితే తీశారు.
నిర్మాణ విలువలు:
లవ్, ఫ్రెండ్‍షిప్, రిలేషన్, బ్రేకప్స్ చుట్టూ తిరిగే కథకు ఆసక్తికర సన్నివేశాలు జోడించి ఈ సినిమా రూపొందిచారు డైరెక్టర్ తరుణ్ మహదేవ్. సునయని, సాకేత్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు శ్రవణ్ జీ కుమార్ సినిమాటోగ్రఫీ చూసుకున్నారు.సంగీతం బాగుంది.
ఫైనల్‌గా:
స్నేహం, ప్రేమ, అందులోనే గందరగోళం అంటూ ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ 'సమ్మేళనం' ట్రయాంగిల్ లవ్‌స్టోరీని అందరు ఒకసారి తప్పక చూడవచ్చు.












Click it and Unblock the Notifications