పెళ్లయిన తెలుగు స్టార్‌హీరోతో రిలేషన్‌లో సంయుక్త మీనన్?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరుగా ఉన్నారు సంయుక్త మీనన్. పవన్ కల్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ సినిమాద్వారా తెలుగుతెరకు పరిచయమైంది. ఈ సినిమాలో రానాకు భార్యగా నటించడంద్వారా తన అభినయంతో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ సినిమా నుంచి సంయుక్తకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
వరుస విజయాలు సాధించింది
భీమ్లానాయక్ తర్వాత కల్యాణ్ రామ్ సరసన బింబిసార్, ధనుష్ తొలి తెలుగు చిత్రం సార్ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. భీమ్లానాయక్ తోపాటు బింబిసార, సార్ సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. సాయిధరమ్ తేజ్ తో నటించిన విరూపాక్ష సినిమాలో తన నటనలోని రౌద్రరసాన్ని పరిచయం చేసింది. తాజాగా ఈమె నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమానే కాకుండా సంయుక్త చేతిలో మరో నాలుగు సినిమాలున్నాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్లను పోస్ట్ చేస్తుంటుంది.

నిత్యం వార్తల్లో నిలిచే సంయుక్త
ప్రతి నిత్యం వార్తల్లో నిలిచే సంయుక్త మీనన్ తెలుగులో స్టార్ హీరోగా ఉణ్న వ్యక్తితో రిలేషన్ లో ఉందనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వార్త తెలుగు ఫిలింనగర్ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సంయుక్త ప్రేమాయణం సాగిస్తున్న ఆ స్టార్ హీరో ఎవరు అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఆ హీరోకు ఇప్పటికే వివాహమైంది. త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. పెళ్లియిన వ్యక్తితో ప్రేమాయణం ఏమిటనే విషయంపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ హీరో ఎవరనే విషయమే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. అయితే ఈ వార్తలో నిజం ఎంతో తెలియదుకానీ సెలబ్రిటీలకు సంబంధించి అనేక రూమర్లు వస్తుంటాయి. ఇది కూడా ఆ కోవలోనిదేనా? లేదంటే నిజమేనా? అనేది తెలియాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications