పబ్లిక్‌గా ఆ హీరోతో ఘాటు రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన మెగా హీరోయిన్
ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న హీరోయిన్స్ లిస్ట్‌లో సంయుక్త మీనన్ కూడా ఒకరు. నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో సంయుక్త మీనన్ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. 'భీమ్లా నాయక్' ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ ఆ తర్వాత 'విరూపాక్ష' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా నటించింది. 'బింబిసారా','సార్','డెవిల్' వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. తెలుగుతో పాటు, తమిళ , మళయాళ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఈ హీరోయిన్‌గా మారిపోయింది.
తెలుగులో నిఖిల్ 'స్వయంభూ' తో పాటు.. శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కూడా మూవీస్ ఓకే చేసినట్లు సమాచారం. శర్వానంద్‌తో సంయుక్త మీనన్ నటిస్తోన్న కొత్త సినిమాకు 'నారీ నారీ నడుమ మురారీ' అనే పేరును ఖారారు చేశారు.తాజాగా ఈ సినిమాలోని సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. టీజర్‌లో శర్వానంద్, సంయుక్త మీనన్ రొమాన్స్ హైలెట్‌గా నిలిచింది. ఇద్దరు కూడా ఘాటు రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ఈ పాటలో శర్వానంద్ లవర్ బాయ్‌గా కనిపిస్తూ సంయుక్త మీనన్ చుట్టూ తిరుగుతున్నాడు. అలాగే ఆమెతో ల్యాబ్‌లో రోమాన్స్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాడు.కాగా పూర్తి సాంగ్ ఏప్రిల్ 9న విడుదల కానుంది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక సంయుక్త మీనన్ విషయానికి వస్తే..ఆ మధ్య తెలుగు ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తెలుగు సినిమాల్లో నటించాలంటే చాలా కష్టం.భాష రాకపోవడం ఒక కారణం అయితే, మేకప్ మరో కారణమని తెలిపింది. వినడానికి వింతగా ఉన్నా కూడా నా వరకు అది చాలా పెద్ద విషయమని చెప్పుకొచ్చింది. మలయాళ సినిమాల్లో చేసేటప్పుడు మేకప్ వేసుకోవడం వెంటనే అయిపోతుంది.చాలా లైట్‌గా, సహజంగా వేస్తారు. యాక్టింగ్ చేసేటప్పుడు కూడా పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లు అనిపిస్తుంది.
Darsanamey... Madhura Kshanamey
— BA Raju's Team (@baraju_SuperHit) April 7, 2025
Neevu Nenu Ika Manamey 💕
Love is in the air and in every note ✨️#Darsanamey Promo OUT NOW
Full video song on April 9th 🎶
A @Composer_Vishal musical ❤️🔥
Charming star @ImSharwanand @iamsamyuktha_ @sakshivaidya99 @RamAbbaraju @ItsActorNaresh… pic.twitter.com/iHcaXwj0FJ
ఇక తెలుగులో చాలా జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. తెరపై ఎలా కనిపిస్తామా అని ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలీ. ఎక్కువ మేకప్ వేస్తారు. షాట్ చేస్తున్నప్పుడు కూడా మేకప్‌ను చెక్ చేసుకోవాలి. అది నటించడానికి అంత కంఫర్ట్‌గా అనిపించదు. చర్మంపై ఏదో ఉన్నట్లే అనిపిస్తుంది నాకు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంయుక్త మీనన్ .. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. ఆ మధ్య ఇంటర్య్వూలో తెలుగు ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంయుక్త మీనన్ హాట్ హాట్ ఫొటోషూట్‌లతో అభిమానులను అలరిస్తోంది.












Click it and Unblock the Notifications