Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'భర్త చనిపోయిన వెంటనే ప్రియుడితో వెళ్లిపోయింది'.. ఆ హీరోయిన్ పై ట్రోల్స్..!!

సినీ పరిశ్రమ ఓ సముద్రం లాంటిది. అందులో అవకాశం దొరకడమే ఓ భాగ్యం. ఒక్క అవకాశం దొరికినా చాలు.. ఒక్క సినిమాలో కనిపించినా చాలు అని ఇండస్ట్రీకి వచ్చేవాళ్లు వేల మంది ఉంటారు. కానీ అందరూ హీరోలు, హీరోయిన్లు కాలేరు. కొన్నిసార్లు బలమైన, కష్టమైన పాత్రలు చేయాల్సిందే. అది హీరో అయినా.. హీరోయిన్ అయినా.. అలా కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రలు చేసి ఆ తర్వాత స్టార్ హీరోలు అయిన సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. పాత్ర ఏదైనా న్యాయం చేయాలని భావించిన సెలబ్రిటీలు ఇప్పుడు టాప్ స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే మలయాళీ నటి సంయుక్త వర్మ ఇప్పటి వరకు అనేక సినిమాల్లో నటించారు.

కెరీర్ లో ఎన్నో హిట్ మూవీస్ లో సంయుక్త వర్మ నటించారు. అయితే మలయాళీ నటుడు బీజూ మీనన్ తో వివాహం తర్వాత ఆమె సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక ఇటీవలికాలంలో ఆమె మరోసారి సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ అయ్యారు. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ నెట్టింట్ ట్రెండ్ అవుతున్నారు. అయితే తన కెరీర్ లో కొన్ని పాత్రలు చేయడం వల్ల తాను ట్రోల్స్ , ఇబ్బందులకు గురయ్యానని తెలిపారు సంయుక్త వర్మ.

అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మాజా మూవీలో తాను నటించిన పాత్రపై ట్రోల్స్ వచ్చినట్లు నటి సంయుక్త ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ మూవీలో భర్త చనిపోయిన వెంటనే లవర్ దగ్గరకు వెళ్లిపోయిన క్యారెక్టర్ లో తాను నటించినట్లు పేర్కొన్నారు.

" మాజా మూవీ నేను నటించిన చిత్రాల్లో ప్రత్యేకమైనది. ఈ కథను మాధవి కుట్టీ రాశారు. ఈ సినిమాలో నా పాత్రను చాలామంది మహిళా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ మూవీలో భర్త చనిపోయిన వెంటనే లవర్ దగ్గరకు వెళ్లిపోయిన పాత్రలో నేను నటించాను" అని సంయుక్త వర్మ చెప్పుకొచ్చారు. మరో సినిమా మేఘమల్హార్ లోని పాత్రకు కూడా ట్రోల్స్ వచ్చాయని ఆమె అన్నారు.

Samyuktha Varma Reveals She Faced Trolling Over Some Past Characters She Played Malayalam actress

ఇలాంటి పాత్రలను ఎందుకు సెలక్ట్ చేసుకుంటున్నారు.. అని చాలామంది అడిగారని.. అప్పుడు తాను.." నేను సంయుక్త వర్మ. మీరు స్క్రీన్ పై చూసే క్యారెక్టర్ కాదు నేను. మన చుట్టూ అనేక మంది మహిళలు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ.. అందులో కొన్నింటిని మాత్రమే నేను తెరపై చూపిస్తున్నా" అని సంయుక్త వర్మ తెలిపారు. ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+