ఆ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం పక్కా అంటున్న సందీప్ కిషన్..
ఇండియన్ సినిమా రూపు రేఖలు మారిపోయాయి. ఒకప్పుడు ఎన్ని రోజులు సినిమా ఆడేది ప్రామాణికంగా తీసుకునేవారు.. మారుతున్న పరిస్థితుల రీత్యా ఇప్పుడు కలెక్షన్స్ మీదే సినిమా టాక్ డిపెండ్ అయ్యి ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా తెలుగు ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచడమే కాకుండా ఇండియన్ సినిమాని కూడా నెక్స్ట్ ఎవెల్ కి తీసుకెళ్లింది. ఆ సినిమాతోనే మొదటిసారిగా వెయ్యి కోట్లు కలెక్షన్స్ ని రాబట్టగలిగాం. ఇప్పటికే ఈ క్లబ్ లో 8 సినిమాలు చేరిపోయాయి.
వెయ్యి కోట్లు కలెక్షన్స్ వచ్చిన సినిమాల్లో ఫస్ట్ ఇండియన్ మూవీగా 'బాహుబలి 2' రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ నటించిన 'దంగల్'.. కన్నడ స్టార్ హీరో యశ్ - ప్రశాంత్ నీల కాంబోలో వచ్చిన 'KGF 2'.. రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలిసి నటించిన 'RRR'.. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్', 'జవాన్' చిత్రాలు ఉన్నాయి. అలానే ప్రభాస్ 'కల్కి', అల్లు అర్జున్ 'పుష్ప 2 చిత్రాలు వెయ్యి కోట్ల మార్క్ ను అధిగమించాయి.

ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ రీసెంట్ గానే 'మజాకా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లోకేష్ కనగరాజ్ - సూపర్ స్టార్ రజినీ కాంత్ కాంబినేషన్ లో వస్తున్న 'కూలీ' సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాని దాదాపు 45 నిమిషాల వరకు చూశానని.. ఆ మూవీ తప్పకుండా వెయ్యి కోట్లు కలెక్షన్స్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా కూలీ సినిమాలో తాను నటించడం లేదని వెల్లడించారు.
ఇక రజినీ కాంత్ హీరోగా రాబోతున్న ఈ చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, పూజా హెగ్డే, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 1000 కోట్ల క్లబ్ లో టాలీవుడ్ నుంచి 4 సినిమాలు.. బాలీవుడ్ నుంచి 3 చిత్రాలు.. శాండిల్ వుడ్ తరపున ఒక సినిమా ఉంది. దీంతో కోలీవుడ్ నుంచి వెయ్యి కోట్లు సాధించే ఫస్ట్ సినిమా కూలీనే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు 2017లో సందీప్ కిషన్ హీరోగా నటించిన 'మా నగరం' సినిమాతోనే లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 'ఖైదీ' 'మాస్టర్' 'విక్రమ్' 'లియో' చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి ఒక సినిమాతో మరొకటి లింక్ చేసి తెరకెక్కిస్తున్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర కూలీ మూవీ ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications