ప్రముఖ నటికి చేదు అనుభవం, భర్త ముందే అంటూ ఆవేదన, అక్కడ చేతులు వేసి, కారులో !
కర్ణాటక రాజధాని బెంగళూరుతో సహా ఇటీవల కర్ణాటకలో జరిగిన కొన్ని సంఘటనలతో మనం ఇంత సురక్షితంగా ఉన్నామా అనే భయం వేస్తోందని, సామాన్య పౌరులు, మహిళల్లో భయంతో పాటు ఆందోళనలు సృష్టిస్తున్నాయని, హత్యలు, దాడులు, దారుణాలు జరుగుతున్నాయని అనేకసార్లు వెలుగులోకి వస్తున్నాయని, శాండల్‌వుడ్ నటి హర్షిక పూనాచా (హర్షిక) సంచలన ఆరోపణలు చేశారు.
స్యాండిల్ వుడ్ నటి హర్షిక బెంగళూరు రెస్టారెంట్‌లో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఫోటోలతో సహ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు, సన్నిహితులతో పంచుకుంది. దీనికి సంబంధించిన వివరాలను హర్షిక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్ చేశారు. మన బెంగళూరులో స్థానికులమైన మనం ఎంత సురక్షితంగా ఉన్నామో అని తనకు జరిగిన సంఘటనతో భయం వేస్తోందని, కొన్ని సార్లు ఆశ్చర్యపోతున్నానని, దాని గురించి ఆలోచించిన తర్వాత తనకు భయం వేస్తోందని కన్నడ నటి హర్షిక ఆందోళన వ్యక్తం చేసింది.

ఇటీవల బెంగుళూరులో నాకు ఎదురైన ఒక భయంకరమైన అనుభవాన్ని బెంగళూరు ప్రజలతో, తన అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించుకున్నానని హర్షిక తెలిపారు. నా స్నేహితులు, కుటుంబం, పోలీసు డిపార్ట్‌మెంట్‌లోని కొంతమంది పరిచయస్తులతో మాట్లాడిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నానని నటి హర్షిక అన్నారు. కానీ ఇది నా అనుభవం నుండి ఇతరులకు సహాయపడుతుందని భావించినందున నేను తనకు జరిగిన భయంకర సంఘటనను అందరికి షేర్ చేస్తున్నానని హర్షిక తెలిపారు
బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్ సమీపంలోని పులికేశి నగర్‌లోని మసీదు రోడ్‌లోని కరామా అనే రెస్టారెంట్‌లో మా కుటుంబంతో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్లానని హర్షిక వివరించారు. రాత్రి భోజనం ముగించుకుని మేము వాలెట్ పార్కింగ్ నుండి మా కారులోకి వస్తున్నప్పుడు డ్రైవర్ సీటు కిటికీ దగ్గర అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు కనిపించారు. తరువాత రెచ్చిన నిందితులు ఇద్దరూ హర్షిక దంపతులను దుర్భాషలాడారని నటి ఆరోపించారు.
నిందితులు మా వాహనం కదలనివ్వకుండా చేశారని, తరువాత మీ వాహనం కదిపితే మమ్మల్ని తగలే అవకాశం ఉంది అంటూ మాతో వాగ్వాదానికి దిగారని నటి హర్షిక ఆరోపించారు. కానీ నా భర్త మాత్రం కారు కదపనని, మేము ఫ్యామిలీతో వచ్చామని, దయచేసి మమ్మల్ని వదిలేయమని వారికి చెప్పాడని నటి హర్షిక వివరించింది. ఎందుకంటే నిందితులు మాకు సంబంధం లేని, అర్థం కాని సంఘటన గురించి మాతో మాట్లాడుతూ గొడవపెట్టుకున్నారని నటి హర్షిక ఆరోపించారు.
మేము వాహనాన్ని కొంచెం ముందుకు కదిపామని, తరువాత ఆ ఇద్దరు వ్యక్తులు వారి భాషలో మమ్మల్ని దుర్భాషలాడడం ప్రారంభించారని, కన్నడిగులకు గుణపాఠం చెబుతామని మమ్మల్ని హెచ్చరించారని నటి హర్షిక ఆరోపించారు. నా భర్తపై దాడి చెయ్యడానికి ప్రయత్నిచారని, తరువాత నా భర్తను కొట్టి దాడికి యత్నించారని, ఆ సమయంలో నా భర్త చాలా ఓపికగా ఉన్నాడని, నిందతుల తీరుతో తన భర్త పెద్దగా స్పందించకపోవడంతో తాను ఆశ్చర్యపోయానని నటి హర్షిక ఆరోపించారు.
మామూలుగా చిరాకుగా ఉండే తన భర్త ఆ రోజు అలా ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని నటి హర్షిక తెలిపింది. తరువాత రెచ్చిపోయిన నిందితులు సుమారు 20 మంది నుండి 30 మంది సభ్యుల బృందాన్ని అక్కడికి పిలిపించి తమ మీద దౌర్జన్యం చేశారని, సుమారు 2 నుంచి 3 నిమిషాల్లో ఆ సంఘటనా స్థలానికి అంత మంది చేరుకొవడంతో తాము భయపడిపోయామని, తరువాత నిందితులు తన భర్త మెడలో ఉన్న బంారు చైన్ లాక్కొని దౌర్జన్యం చేశారని నటి హర్షిక ఆరోపించారు.
తరువాత తేరుకున్న తన భర్త సకాలంలో స్పందించి అతని బంగారు గొలుసు లాక్కొని తనకు ఇచ్చాడని, బంగారు గొలుసు రాకపోవడంతో ఆగ్రహానికి గురైన నిందితులు అందరూ తమ బంగారు గొలుసు, ఇతర విలువైన వస్తువులు లాక్కొని మా వాహనాన్ని ధ్వంసం చెయ్యడానికి ప్రయత్నించారని, మమ్మల్ని శారీరకంగా హింసించే ప్రయత్నం చేశారని, మా వాహనంలో మహిళలు, కుటుంబ సభ్యులు ఉండడంతో నా భర్త పెద్దగా స్పందించలేదని కన్నడ నటి హర్షిక సోషల్ మీడియాలో ఆరోపించారు.
తనకు జరిగిన చేదు అనుభవం గురించి నటి హర్షిక వీడియో, ఫొటోలతో సహ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిందితులు మాతో ప్రవర్తించిన తీరుతో విసిగిపోయి తాము మొత్తం వీడియో తీశామని, మా మొబైల్ లో మొత్తం రికార్డు అయ్యిందని నటి తెలిపింది. ఈ సంఘటనతో తాము బెంగళూరులో సురక్షితంగా ఉన్నామా ?, లేదా ? అనే అనుమానం వస్తోందని నటి హర్షిక విచారం వ్యక్తం చేశారు. నటి హర్షికకు జరిగిన చేదు అనుభవానికి కారణం అయిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రలు పోలీసులకు మనవి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications