నీకూ ఒక తల్లి, చెల్లి, అక్క, భార్య ఉన్నారని గుర్తు పెట్టుకోండి, స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు !
శ్యాండిల్ వుడ్ రచయిత, దర్శకుడు యోగరాజ్ భట్ దర్శకత్వం వహించిన కరటక దమనక చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్‌కుమార్-ప్రభుదేవా జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. శివరాత్రి పండుగ, వీకెండ్ తో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందని ఆ సినిమా నిర్మాతలు భావిస్తున్నారు.
ప్రభుదేవా, శివన్న, యోగరాజ్ భట్ కలయికలో వచ్చిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో ఆర్ముగం, రవిశంకర్, రంగాయణ రఘు, ఆ సినిమా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, తనికెళ్ల భరణితో సహా పెద్ద తారాగణం నటించింది. ప్రియా ఆనంద్, నిశ్వికా నాయుడు హీరోయిన్లుగా అద్భుతంగా నటించారని అభిమానులు అంటున్నారు. కరటక దమనక చిత్రం విడుదల అనంతరం చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ప్రేక్షకుల స్పందనకు హీరో శివరాజ్ కుమార్ తో పాటు సినిమా యూనిట్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

నీటి సమస్యపై సినిమా తీయడం యాదృచ్ఛికంగా అనిపిస్తోందని, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని ప్రజలు నీటి కోసం విలవిలలాడుతున్నారని చిత్ర బృందం తెలిపింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన గురించి సెంచరీ స్టార్, హీరో శివరాజ్‌కుమార్ మాట్లాడారు. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల రియాక్షన్స్‌ని చూడాలని తానుకూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూశానని అన్నారు. సోషల్ మీడియాలో కొంత మంది రాసిన రాతలు తాను గమనించానని శివరాజ్ కుమార్ అన్నారు.
దాదాపుగా అందరూ కరటక దమనక సినిమా బాగుందని, బాంబాట్ గా ఉందని అంటున్నారని, అయితే కొందరు ఈ సినిమాను ఇంకా బాగా చేసి ఉండొచ్చు అంటున్నారని, 100 శాతం మందిని ఎంటర్‌టైన్ చేయలేకపోతున్నారని కొందరు అంటున్నారని, వంద శాతం మందికి నచ్చేలా సినిమా తియ్యాలంటే దేవుడి వళ్లనే సాధ్యం అవుతుందని, అయితే మనం మనుషులు అని, మనం మనుషులు లాగా ఆలోచించాలని, మనుషులు లాగే ఉండాలని హీరో శివరాజ్ కుమార్ అన్నారు.

ఇదే సమయంలో మాట్లాడిన హీరో శివరాజ్ కుమార్ కరటక దమనక సినిమా గురించి సోషల్ మీడియా రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ మండిపడ్డారు. కొంతమంది వాడే భాష చాలా ముఖ్యం అని గుర్తు చేశారు. కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటప్పుడు వారి భాష చూసి విసిగిపోయానని, మాట మీద కొందరికి నియంత్రణ ఉండాలని, మీరు వాడే భాషను అందరూ గమనిస్తున్నారని గుర్తు పెట్టుకోవాలని, మాట మీద, ఉపయోగించే బాష మీద హద్దులు ఉండాలని హీరో శివరాజ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మీకు ఒక తల్లి, చెల్లి, అక్క, భార్య, కూతురు ఉందనే విషయం గుర్తు పెట్టుకోవాలని, మీరు ఉపయోగించే బాషను వాళ్లకూడా చూస్తారని, వాళ్లు కూడా చదువుతారని విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలని, తరువాతే సోషల్ మీడియాలో మీ అభిప్రాయం రాయాలని, టీవీల్లో, యూట్యూబ్ చానల్స్ లో మాట్లాడాలని కొందరిని ఉద్దేశించి హీరో శివరాజ్ కుమార్ మండిపడ్డారు. కరటక దమనక సినిమా గురించి కొందరు సోసల్ మీడియాలో ఉపయోగించిన బాష గమనించిన తరువాత తనకు చాలా బాదకలిగి ఇలా మాట్లాడాడనని హీరో శివరాజ్ కుమార్ అన్నారు.
సినిమా బాగాలేకపోతే బాగలేదని స్పష్టంగా చెప్పండి అని హీరో శివరాజ్ కుమార్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న కొందరికి హితవుపలికారు. అంతే కాని సినిమాను నాశనం చెయ్యడానికి అసభ్యంగా బాషను ఉపయోగించడం మంచి పద్దతి కాదని, నువ్వు చేసే పనిని నీ తల్లి, చెల్లి, భార్య, కూతురు, అక్క గమనిస్తారని గుర్తు పెట్టుకోవాలని, తరువాత మావాడు ఇలాంటి వాడా ? అని వాళు మిమ్మల్ని అస్యహించుకుంటారని హీరో శివరాజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరటక దమనక సినిమా గురించి కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుండటంతో అలాంటి వాళ్ల మీద హీరో శివరాజ్ కుమార్ ఇలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ మండిపడటం శ్యాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం శివన్న వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అర్జున్ జన్యతో దర్శకత్వంలో '45' అనే సినిమాలో, తమిళ దర్శకుడు నర్తన్ తో కలిసి బైరతి రంగల్ అనే సినిమా షూటింగ్‌లతో శివరాజ్ కుమార్ బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్న శివరాజ్ కుమార్ చాలా బిజీగా ఉన్నారు. కెప్టెన్ మిల్లర్ తర్వాత శివన్న దగ్గరకు తమిళ కథలు చాలానే వస్తున్నాయి.
అలాగే ఆయన హీరోగా నటిస్తున్న చాలా సినిమాలు షూటింగ్ జరుపుకోవడానికి సిద్దం అవుతున్నాయి. తెలుగులో రామ్ చరణ్ తదుపరి చిత్రంలో కీరోల్ లో నటించడానికి శివన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జైలర్ చిత్రంలో రజనీకాంత్‌తో కలసి నరసింహగా నటించిన శివన్న అక్కడి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రానున్న సినిమాలో శివన్నకు మంచి క్యారెక్టర్ చిక్కందని శ్యాండిల్ వుడ్ వర్గాలు అంటున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications