'రెండో పెళ్లి'పై పోస్ట్ పెట్టిన సానియా మీర్జా!

భారతదేశంలో టెన్నిస్ స్టార్ ప్లేయర్ గా కొనసాగిన సానియా మీర్జా తన భర్తకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కుమారుడితో కలిసి హైదరాబాద్ లో ఉంటోంది. షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. 14 సంవత్సరాల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు. వేరే అమ్మాయితో షోయబ్ మాలిక్ ప్రేమలో ఉండటంవల్లే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులకు కారణమైందని వార్తలు వచ్చాయి.

ఎంతోమంది సలహా ఇచ్చారు
సానిమా మీర్జా రెండో పెళ్లి చేసుకోవాలంటూ ఆమె సన్నిహితులు ఎంతోమంది సలహా ఇచ్చినప్పటికీ ఆమె తన కుమారుడితో కలిసి జీవించడానికే మొగ్గుచూపుతోంది. ఇండియన్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయికానీ సానియా తండ్రి వాటిని ఖండించారు. షమీ కూడా తన భార్య జహాన్ కు విడాకులిచ్చారు. అయితే సానియా ఒంటరిగా ఉండొద్దని రెండో పెళ్లి చేసుకోవాలంటూ పాకిస్తాన్ కు చెందిన నటుడు నబీల్ జాఫర్ గతంలోనే వ్యాఖ్యానించారు. విడాకులు తీసుకున్న సమయంలో సానియా మీర్జా... విడాకులు తీసుకున్న తర్వాత రెండోపెళ్లి చేసుకోవాలా? ఒంటరిగా ఉంటే సరిపోదా? అని వ్యాఖ్యానించింది.

Sania Mirza posted that she wants to start a new life

ఎవర్ని చేసుకున్నా పర్వాలేదు
టీవీ కార్యక్రమంలో యాంకర్ జాఫర్ ను ప్రశ్నించగా పెళ్లి చేసుకోవాలని సమాధానమిచ్చాడు. విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ముగిసిపోలేదని, చాలామంది అంతటితో తమ జీవితం ముగిసిపోయిందని భావిస్తారని, కానీ అలా ఆలోచించడం తప్పన్నారు. విడాకులు తీసుకోవడం అనేది దురదృష్టకరమైనప్పటికీ ఎవరి జీవితం ఎప్పుడూ చీకటిలో ఉండిపోకూడదని హితవు పలికారు. షోయబ్ మాలిక్ ఇప్పటికే రెండో వివాహం చేసుకున్నాడనే విషయాన్ని అతను గుర్తుచేశాడు. 'కొత్త జీవితం ప్రారంభించాలి' అంటూ సానియా మీర్జా పోస్ట్ చేసింది. దీనికి బదులుగా ఓ నెటిజన్ సానియా రెండో పెళ్లి చేసుకోవాలని, కానీ ముస్లిం వ్యక్తిని మాత్రం చేసుకోవద్దన్నాడు. అతను ఇచ్చిన సలహాకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ముస్లిం వ్యక్తినే చేసుకోవాలని కామెంట్లు పెడుతుండగా, మరికొందరు మాత్రం ఎవర్ని చేసుకున్నా పర్వాలేదని కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+