బాలీవుడ్ నటి మాజీ భర్త గుండెపోటుతో మృతి

Sanjay Kapoor Death: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఇంగ్లాండ్‌లో గుండెపోటుతో 53 ఏళ్ల వయసులో మరణించారు. పోలో ఆడుతుండగా ఆయనకు గుండెపోటుకు గురయ్యాడు. ఆట సమయంలో సంజయ్ అకస్మాత్తుగా నేలపై పడపోయాడని సమాచారం. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు అతడిని కాపాడలేకపోయారు. ఆయన అంత్యక్రియల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కరిష్మా తర్వాత ప్రియా సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్న సంజయ్
కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ 2003 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వారు 2016 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఈ వివాహం నుంచి వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు సమైరా, కుమారుడు కియాన్ ఉన్నారు. కరిష్మాతో విడాకుల తర్వాత 2017 సంవత్సరంలో ఆయన మోడల్ ప్రియా సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి కూడా అజారియస్ అనే కుమారుడు ఉన్నాడు. సంజయ్‌తోప్రియాకు కూడా రెండో వివాహమే. ఆమెకు మొదటి వివాహం నుంచి సఫీరా అనే కుమార్తె ఉంది. ఆమె మొదటి వివాహం విక్రమ్ చత్వాల్‌తో జరిగింది.

Sanjay Kapoor Karisma Kapoor s Ex-Husband Dies of Heart Attack at 53

నటుడు, రచయిత సుహైల్ సేథ్ ఒక పోస్టులో సంజయ్ కపూర్ మరణ వార్తను ధ్రువీకరిస్తూ విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సంజయ్ మరణ వార్త నేపథ్యంలో ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ కపూర్ ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త. ఆయన పోలో ఆటను చాలా ఇష్టపడేవాడు.

విమాన ప్రమాదంపై సంజయ్ కపూర్ చివరి పోస్ట్
ఒకవైపు అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ఘటనతో దేశం మొత్తం ప్రస్తుతం దుఃఖంలో మునిగిపోతే, మరోవైపు, సంజయ్ కపూర్ మరణ వార్త అందరినీ కదిలించింది. ఈ విమాన ప్రమాదం గురించి సంజయ్ స్వయంగా చాలా బాధపడ్డాడు. దీనికి సంబంధించి ఆయన తన చివరి పోస్ట్‌ను Xలో చేశారు. కొన్ని గంటల క్రితం చేసిన ఈ పోస్ట్‌లో, 'అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి విచారకరమైన వార్త. నా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలందరితో ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో వారు బలాన్ని పొందాలని కోరుకుంటున్నాను. #planecrash' అని పోస్టు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+