ఇదేం ట్విస్ట్.. సంక్రాంతి బరిలోకి ఊహించని మూవీ..
సంక్రాంతి తెలుగు ప్రజలతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద పండుగ. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో రిలీజ్ అవుతుంటాయి. హాలీడే సీజన్ కావడంతో హిట్ టాక్ వస్తే చాలు ఈజీగా లాభాలు వచ్చేస్తాయని చాలా మంది దర్శకనిర్మాతలు తమ సినిమాల్ని సంక్రాంతి బరిలో నిలబెడతారు. అయితే టాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు బెర్త్ లు కన్ఫామ్ చేసుకున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ రిలీజైంది.
ఇక జనవరి 12 న మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కాంబోలో మన శంకరవరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కానుంది. ఆ తరువాతి రోజు అంటే జనవరి 13న మాస్ మహారాజ్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఇక పండగ రోజున అంటే జనవరి 14న రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీతోపాటు సాయంత్రం 6 గంటల ఆట నుంచి హీరో శర్వానంద్ నారీనారీ నడుమ మురారీ మూవీ రిలీజ్ కానుంది.
అయితే ఇప్పుడు తాజాగా సంక్రాంతి బరిలోకి మరో స్టార్ హీరో మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. అదే తమిళ హీరో కార్తి నటించిన 'వా వాతియర్' సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. తెలుగులోనూ అదే రోజు 'అన్నగారు వస్తారు' అనే టైటిల్ లో రాబోతుంది. ఈ మూవీ గత నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాల నేపథ్యంలో వాయిదా పడింది. అయితే రిలీజ్ కు అడ్డంకులు తొలిగిపోయిన నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జనవరి 14 న మూవీ రిలీజ్ అంటూ తాజాగా ప్రకటన చేశారు.

ఇక తమిళ హీరో కార్తికు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆవారా, ఖైదీ, ఖాకీ చిత్రాలు ఇక్కడ కూడా బాగా ఆడాయి. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీలో కార్తీకి జోడీగా టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు.












Click it and Unblock the Notifications