రాం చరణ్ హీరోయిన్ గా సారా - కొత్త మూవీ ఫిక్స్..!!

సినీ ఇండస్ట్రీలో మరో కొత్త హీరోయిన్ ఎంట్రీకి రంగం సిద్దమైంది. క్రికెట్ దేవుడుగా కొలిచే సచిన్ గారాల పట్టి సారా బాలీవుడ్ లో ప్రవేశం దాదాపు ఖాయమైంది. అయితే, అనూహ్యంగా సారా - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయటానికి తుది కసరత్తు జరుగుతోంది. అటు ప్రపంచకప్ క్రికెట్ లో సారా - గిల్ ఎపిసోడ్ ఫ్యాన్స్ కు ఆసక్తిని పెంచింది. ఇప్పుడు సినీ పరిశ్రమలోకి టెండుల్కర్ తనయ - మెగాస్టార్ తనయుడితో కలిసి సినిమా చేయటం మరో సంచలనంగా మారుతోంది.

క్రికెట్ గాడ్ సచిన్ కుమార్తె- మెగాస్టార్ వారసుడు రాం చరణ్ కలిసి సినిమా దాదాపు ఖరారైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫ్యామిలీ పార్టీలకు హాజరవుతూ ఫుల్ బిజీగా మారిపోయారు. చరణ్, శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ చిత్రం ఉండనుందని ఇప్పటికే అనౌన్స్ చేసారు. ఇక, ఇదే సమయంలో రాజ్ కుమార్ హిరానీతో సచిన్ టెండూల్కర్ తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక సచిన్ స్వయంగా చెప్పడంతో డైరెక్టర్ కూడా మంచి సినిమాలో అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడట. సచిన్ కూతురు సారా టెండూల్కర్ ని రామ్ చరణ్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి గ్రాండ్ గా పరిచయం చేయాలి అని రాజ్ కుమార్ హిరానీ నిర్ణయించారు.

Sara Tendulkar to make her bollywood bebut with Hero Ram Charan soon as Reports

ప్రస్తుతం రామ్ చరణ్ బాలీవుడ్ లో కూడా రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయటం ఖరారు కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. రామ్ చరణ్, రాజ్ కుమార్ హీరానీ తో కలిసి చేయబోయే సినిమా కోసం ఒక కొత్త హీరోయిన్ ని పరిచయం చేయాలని భావిస్తున్నారట మూవీ యూనిట్. ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయం లేని అమ్మాయిని రామ్ చరణ్ సినిమాలో చూపించాలని రాజ్ కుమార్ హీరానీ ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే పలు యాడ్స్..డిజైనింగ్ లో బిజీగా ఉన్న సారాను వెండితెరకు పరిచయం చేయటానికి ముహూర్తం ఫిక్స్ అయిందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు సారా - రాం చరణ్ మూవీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+