రెండేళ్లుగా ప్రెగ్నెంట్ అంట.. ఏంటో ఈ వింత!
ప్రముఖ టీవీ, సినీ జంట రవి దూబే, సర్గున్ మెహతా త్వరలో పేరెంట్స్ కాబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సర్గున్ మెహతా ఎట్టకేలకు మౌనం వీడారు. నెట్టిట వస్తున్న పుకార్లపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పడమే కాకుండా.. ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రసారం చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పందించిన సర్గున్ మెహతా
శనివారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన సర్గున్ మెహతా.. "నా ప్రెగ్నెన్సీ గురించి నాకు, రవికి తెలియని విషయాలు మీకు ఎలా తెలుస్తున్నాయి? దయచేసి ఆపండి. మీడియా కథనాల ప్రకారం చూస్తే నేను గత రెండేళ్లుగా ప్రెగ్నెంట్‌గానే ఉన్నాను. ఇంత సుదీర్ఘ కాలం ఎవరైనా గర్భవతిగా ఉంటారా? కొంచెం ప్రశాంతంగా ఉండండి.. ఇలాంటి చెత్త వార్తలను వ్యాప్తి చేయడం ఆపండి" అంటూ మండిపడ్డారు. ఏదైనా వార్త ప్రచురించే ముందు తమ టీమ్‌ను సంప్రదించడం కనీస ధర్మమని ఆమె హితవు పలికారు.

సెలూన్ వెళ్లిన గర్భవతి అనేస్తారా?
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సర్గున్ మరింత ఘాటుగా స్పందిస్తూ.. "ఈ పిల్లలందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇంత త్వరగా ప్రసవాలు ఎలా చేస్తున్నాను? నేను సెలూన్ లేదా కేఫ్‌కు వెళ్లినా కూడా ప్రెగ్నెంట్ అనేస్తారా?" అంటూ ఎద్దేవా చేశారు. అసలు తన డాక్టర్ల గురించి మీడియాకు ఏమైనా తెలుసా అని ఆమె ప్రశ్నించారు.
పెళ్లి అంటే పిల్లల కోసమేనా?
గతంలోనూ సర్గున్ మెహతా ఓ ఇంటర్వ్యూలో పిల్లల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పెళ్లైన జంట అనగానే కేవలం పిల్లల్ని కనడమే వారి పని అన్నట్లుగా సమాజం భావిస్తుంది. ఇది పెళ్లి అనే వ్యవస్థను తక్కువ చేయడమే. ప్రతి ఒక్కరికీ జీవితంలో రకరకాల ప్రాధాన్యతలు, లక్ష్యాలు ఉంటాయి. కొందరు 25 ఏళ్లకే లక్ష్యాన్ని చేరుకుంటారు, మరికొందరు 40 ఏళ్ల వయసులో చేరుకుంటారు. నేను ప్రస్తుతం నా కెరీర్ పరంగా వేరే ప్రయాణంలో ఉన్నాను" అని ఆమె స్పష్టం చేశారు.
12 ఏళ్ల వైవాహిక బంధం
'12/24 కరోల్ బాగ్' అనే టీవీ షో సెట్స్‌లో రవి దూబే, సర్గున్ మెహతా ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత 2013, డిసెంబర్ 7న వీరు వివాహం చేసుకున్నారు. రవి దూబే 'నచ్ బలియే 5' వేదికపై నేషనల్ టెలివిజన్ సాక్షిగా సర్గున్‌కు ప్రపోజ్ చేసిన తీరు అప్పట్లో ఒక సంచలనం. ఇప్పటికీ ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు.












Click it and Unblock the Notifications