'గుంటూరం కారం'లో నారా లోకేష్‌పై సెటైర్లు..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో 'గుంటూరు కారం'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో గుంటూరు కారంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది.

కథలో కొత్తదనం లేదని మహేష్ అభిమానులే సినిమాపై విమర్శలు చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ లేకపోవడంతో పాటు, ఆయన గత సినిమాలను గుర్తు చేయడంతో బాక్సాఫీస్ వద్ద గుంటూరు కారం ఎబో యావరేజ్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సినిమాలో పొలిటికల్ సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని సీన్లు అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీని పరొక్షంగా గుర్తు చేసినట్టు అనిపిస్తోంది.

Satires on Nara Lokesh from Gunturam Karam movie..?

సినిమాలో జేడీపీ అనే రాజకీయ పార్టీకి ప్రకాష్ రాజ్ నాయకుడుగా ఉంటారు. ఆయన తన రాజకీయ వారసత్వం కోసం చేసిన పనులు అచ్చం టీడీపీలో జరిగిన కొన్ని సంఘటనల మాదిరిగానే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రకాష్ రాజ్‌కు 70 ఏళ్లు వయస్సు వచ్చిన రాజకీయాలు చేస్తుంటారు.

ఇది అచ్చం టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర మాదిరిగా ఉందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇక ఆయన రాజకీయ వారసుడుగా చేసిన వ్యక్తి పాత్ర అయితే నారా లోకేష్‌ను పోలి ఉందనే కామెంట్స్ తెర మీదకు వచ్చాయి. వచ్చి రాని తెలుగు, భాష నేర్పించడానికి అతని వెనుక ఓ ట్యూషన్ మాస్టర్ ..ఈ సీన్ చూసిన వెంటనే అందరికి నారా లోకేష్ మదిలో మెదిలారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.

నారా లోకేష్‌కు తెలుగు మాట్లాడటం సరిగా రాదని వైసీపీ నేతలు ఇప్పటికి విమర్శలు చేస్తుంటారు. ఇక సినిమాలో చూపించిన రాజకీయ పార్టీ జెండా రంగు కూడా పసుపుతో కూడింది కావడంతో..ఈ కామెంట్స్‌కు మరింత బలం చేకూర్చినట్టు అయిందని అంటున్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+