OTT: ఓటీటీకి వచ్చేస్తున్న బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
Save The Tigers Season 3: తెలుగు డిజిటల్ స్క్రీన్‌పై ఫ్యామిలీ ఆడియెన్స్‌ను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. సీజన్ 1, సీజన్ 2 లతో ఊహించని రేంజ్‌లో రికార్డు వ్యూస్ సాధించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నుంచి ఇప్పుడు ముచ్చటగా మూడో భాగం రాబోతోంది. తాజాగా ఈ సిరీస్ నెక్స్ట్ సీజన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది జియోస్టార్ టీమ్. రెండు సీజన్ల సరదా, భార్యాబాధితులైన భర్తల కష్టాలు, చురుకైన డైలాగులతో అలరించిన ఈ ఫ్రాంచైజీ.. ఈసారి సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈసారి సోషల్ ఎక్స్‌పెరిమెంట్
తాజాగా విడుదల చేసిన 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3' పోస్టర్ చూస్తుంటే ఈసారి కథలో ఒక ఆసక్తికరమైన కాస్మిక్ ట్విస్ట్ ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. రెండు వైవిధ్యమైన ప్రపంచాల మధ్య జరిగే ఒక ప్రత్యేకమైన సోషల్ ఎక్స్‌పెరిమెంట్ చుట్టూ ఈ సీజన్ సాగనుంది. ముగ్గురు భర్తలు పడే ఇబ్బందులు, వారి చుట్టూ తిరిగే కామెడీ డ్రామాకు ఈ కాస్మిక్ కాన్సెప్ట్ తోడవడంతో సిరీస్ సరికొత్త పంథాలో సాగనుంది. సమాజంపై అర్థవంతమైన వ్యాఖ్యానం చేస్తూనే.. సరికొత్త నవ్వుల విందును అందించడానికి షో రన్నర్స్ మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం రంగం సిద్ధం చేశారు.

మొదటి రెండు సీజన్లలో తమ అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రియదర్శి - జోర్దార్ సుజాత,అభినవ్ గోమటం - పావని గంగిరెడ్డి, కృష్ణ చైతన్య - దేవియాని శర్మ, అలరించారు. ఈ మూడు జంటలు సీజన్ 3లోనూ కంటిన్యూ అవుతూ వినోదాన్ని పంచబోతున్నారు. అయితే, ఈ సీజన్‌కు బిగ్గెస్ట్ అసెట్ అండ్ సర్‌ప్రైజ్ ఎలిమెంట్.. టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇవ్వడమే! తాజాగా రిలీజైన పోస్టర్‌లో ఆయన లుక్ చూస్తుంటే కథను మలుపు తిప్పే ఒక కీలకమైన, హిలేరియస్ పాత్రలో ఆయన కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తన మార్క్ కామెడీ టైమింగ్, డ్రామాతో వెన్నెల కిషోర్ ఈ సిరీస్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీరామ్ ఎరగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను శివ మేక, సాహితి చింతలపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications