పిల్లల్ని కనాలంటే భయంగా ఉంది : తమన్నా
తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి , తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది.
తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికి తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది.

ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే తమన్నా పేరెంటింగ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తల్లి కావాలంటే నాకు చాలా భయమేస్తుందని తెలిపింది. తల్లి అంటే పిల్లలకు అన్ని ఇస్తుందని, నా పిల్లలకు అంత ప్రేమ, కేరింగ్ నేను ఇవ్వలేనని తమన్నా తెలిపింది. నా పేరెంట్స్ నాకు చాలా ప్రేమ పంచారని తెలిపింది. వారిని చూస్తుంటే పేరెంటింగ్‌లో డిగ్రీ తీసుకున్నట్లు అనిపిస్తుందంటూ మిల్క్ బ్యూటీ వెల్లడించింది. అలాగే పిల్లలు జన్మించాక ఏం జరుగుతుందో అని భయంగా ఉందని తెలిపింది.












Click it and Unblock the Notifications