చాలామంది మగాళ్లకు లొంగిపోయాను!
తెలుగు సినీ ప్రేమికులకు నటి జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసింది. ప్రధానంగా వ్యాంప్ పాత్రలతో బాగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది. అడపా దడపా సీరియల్స్ లో కూడా నటిస్తోంది. తన జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అలాగే పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఆ వివరాలన్నీ ఆమె మాటల్లోనే..
పరిశ్రమలో నన్ను రక్షించుకునేందుకు ఎటువంటి ప్రణాళికలు వేయలేదు. అందరితో కలివిడిగా ఉండేదాన్ని. కొన్ని సందర్భాల్లో తప్పించుకున్నప్పటికీ మరికొన్ని సార్లు లొంగిపోవాల్సి వచ్చేది. చాలామంది మగాళ్లకు లొంగిపోయాను. అయితే ప్రేమ, పెళ్లి గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. అందంగా ఉండటంతోపాటు వ్యాంప్ పాత్రలు చేయడంతో చాలామంది వచ్చేవారు.. అడిగేవారు.

చాలావరకు తప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు. దీంతో లొంగిపోయేదాన్ని. అయితే ఎవరూ కూడా కొట్టడం, హింసించడం లాంటివి చేయలేదు. ఎటువంటి కోపాన్ని కూడా చూపలేదు. అందరూ కూడా పని అయిందా? లేదా? అన్నట్లుగా ఉండేవారు. పొద్దున్నే మాములుగా ఉండేవారు. పరిశ్రమలో తలుపులు కొట్టడం, అడగడంలాంటివి ఉంటాయి.
ఒకతను రాత్రి తలుపు కొట్టి తీయకపోతే ఉరి వేసుకుంటా అని బెదిరించాడు. అయితే నేను ఎప్పుడూ అటువంటివాటికి భయపడలేదు. తప్పించుకోవడానికి ప్రయత్నించేదాన్ని. అలా తప్పించుకుంటే ఓ దర్శకుడు సగం షూటింగ్ చేసిన తర్వాత వెళ్లిపొమ్మన్నాడు. వివాహ బంధం పెడాకులైన తర్వాత ప్రేమ, పెళ్లి, పిల్లల గురించి ఆలోచించలేదు. ఒంటరిగానే ఉండిపోదామనుకున్నారు. చాలామంది ఎవరైనా పిల్లలను పెంచుకోమని సలహా ఇచ్చారుకానీ వద్దని చెప్పాను.












Click it and Unblock the Notifications