నా జీవితంలో ఎంతోమంది మగాళ్లు ఉన్నారు..పగలు,రాత్రి అదే పని చేశా - హీరోయిన్

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

తాజాగా ఓ నటి తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించారు. సీనియర్ నటి, సింగర్ కునిక సదానంద్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ బాలీవుడ్ జనాలకు ఈమె సుపరిచితురాలే. నటిగా, సింగర్‌గా, లాయర్‌గా, వ్యాపారవేత్తగా... కునిక సదానంద్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా ఆమె పంచుకున్న వ్యక్తిగత జీవిత రహస్యాలు, బాలీవుడ్ చీకటి కోణాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

Senior Actress Kunika Sadanand Makes Shocking Claims on Bollywood Casting Couch and Sexual Harassment

ఆమె మాట్లాడుతూ.. సెట్‌లో లైట్‌మెన్లు కూడా హీరోయిన్‌లను అనుభవించాలి అన్నట్లుగా ఆకలితో చూస్తారని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది. పరిశ్రమలో లైట్‌మెన్ల స్థాయి వరకు నటీమణులను లైంగికంగా వేధించే సంస్కృతి ఉందని ఆమె పరోక్షంగా చెప్పుకొచ్చారు.

నేను జీవితంలో డ్రగ్స్ జోలికి వెళ్లలేదు. కానీ నాకు మద్యానికి బానిస అయ్యానని తెలిపింది. బ్రేకప్స్ తర్వాత మానసికంగా కృంగిపోయాను. ఆ సమయంలోనే నేను మద్యానికి బానిసను అయ్యాను.ఓ రోజు స్టూడియోలో డబ్బింగ్ చెప్పడానికి వెళ్లి అద్దంలో తనను తాను చూసుకొని, దేవుడా, నేను ఇలా అయ్యానేంటీ అని బాధపడినట్లు తెలిపారు. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం సేవించడం తన దినచర్యగా మారిందని, పట్టపగలే బీర్ సేవించేదాన్ని అని ఆమె చెప్పడం ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది.

ఇక తన జీవితంలో ఎదురైన ఎఫైర్ల గురించి కూడా ఆమె ఈ సందర్భంగా వెల్లడించింంది. దిగ్గజ నటుడు ప్రాణ్ కుమారుడు సునీల్ సికంద్‌, సింగర్ కుమార్ సానుతో ఆమె రిలేషన్ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. దీనిపై ఆమెను ప్రశ్నించగా... కునిక మరింత బోల్డ్‌గా సమాధానం ఇచ్చారు. నా జీవితంలో ఇద్దరితో సహజీవనం చేశా. నలుగురితో రొమాన్స్ చేశా. ఇద్దరిని పెళ్లి చేసుకున్నా అని కునిక కుండబద్దలు కొట్టారు. ఆమె జీవితంలో రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. కునిక సదానంద్ తాజాగా జరుగుతున్న హిందీ బిగ్ బాస్‌లో అడుగు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+