18 ఏళ్లు మరో మహిళతో ఎఫైర్.. కానీ నా భార్య చాలా మంచిది !!
సీనియర్ నటుడు జనార్ధనన్ మలయాళ సినీ ప్రేక్షకులకు సూపరిచితులే. తనదైన శైలిలో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా కామెడీ రోల్స్ తో మెప్పించగా.. విలన్‌గా కూడా అదరగొట్టారు. జనార్ధనన్ తన బంధువుల కుమార్తె విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబంతో కలసి కోచ్చిలో స్థిరంగా ఉంటున్నారు. వయసు 75 దాటినా, ఇంకా సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లో కనిపిస్తూ, అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. కెరీర్‌లో వందలాది చిత్రాల్లో నటించి ఆడియన్స్ ని అలరించిన ఈ సీనియర్ నటుడు.. లేటెస్ట్ గా తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
18 ఏళ్లపాటు వివాహేతర సంబంధం..
ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తాను 18 ఏళ్లపాటు ఓ మహిళతో వివాహేతర సంబంధం (extramarital affair) కొనసాగించానని బహిరంగంగా అంగీకరించారు. అలానే మాట్లాడుతూ.. తాను వివాహం అయ్యాక కూడా ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు. దాదాపు 18 ఏళ్ల పాటు తమ బంధం కొనసాగిందని.. ఆమె కోసం చాలా చేశానని చెప్పారు. అంతే కాకుండా ఆ విషయం తన భార్యకు కూడా తెలుసని వివరించారు.

తనకు ఏమీ దాచాల్సిన అవసరం లేదని అందరు మనుషుల్లాగే భావోద్వేగాలు కలవాడినని తెలిపారు. తన భార్య కొన్ని విషయాల్లో ఆసక్తి కోల్పోయిన సందర్భంలో ఒంటరితనాన్ని అనుభవించానన్నారు. అలా మరో మహిళ తన జీవితంలోకి వచ్చిందని జనార్ధనన్ వెల్లడించారు. కానీ సమాజపు ఒత్తిడి కారణంగా ఆమె తనను విడిచిపెట్టిందని ఎమోషనల్ అయ్యారు.
అయితే తన భార్య విజయలక్ష్మి చాలా మంచిదని.. తమ కుటుంబాన్ని, పిల్లలను ఎంతో ప్రేమతో చూసుకుందని అన్నారు. తనను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోలేదని అందువల్లే వారి కుటుంబం ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోలేదని జనార్ధనన్ అన్నారు. తన భార్యకు, కుటుంబానికి ఇలాంటి విషయాలను దాచిపెట్టడం తాను నమ్మదని, నిజాయితీగా చెప్పడం మంచిదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఇక జనార్ధనన్ మలయాళ సినీ రంగంలో దాదాపు ఐదు దశాబ్దాలుగా నటిస్తున్నారు. 'ఒరు సీబీఐ డైరీ కురిప్పు', 'మెలపరంబిల్ ఆన్వీడు', 'మన్నార్ మఠై', 'గాడ్‌ఫాదర్', '2018' వంటి క్లాసిక్ చిత్రాల్లో ఆయన గుర్తుండిపోయే పాత్రలు చేశారు. మొదట విలన్ పాత్రలతో ప్రారంభమైన ఆయన కెరీర్ తరువాత హాస్యపాత్రల దిశగా మలుపు తిరిగింది. ఇటీవల మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన 'హృదయపూర్వం' చిత్రంలోనూ ఆయన కనిపించారు.












Click it and Unblock the Notifications