గుడ్ న్యూస్..మరో బిడ్డకు జన్మనిచ్చిన పవన్ భార్య
వెండితెరకు ఏమాత్రం తీసిపోని విధంగా బుల్లితెర నటులు కూడా ఆకట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే వెండితెరకు ధీటుగా బుల్లితెర నటులు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా సీరియల్స్ నటులు తమ నటనతో ఫ్యామిలీ ఆడియోన్స్‌ను కట్టిపడేస్తున్నారు. అలాంటి బుల్లితెరపై ఆకట్టుకుంటున్న జంటల్లో పవన్, అంజలి కూడా ఒకరు. ముఖ్యంగా అంజలి పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. 'మొగలిరేకులు' సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'రాధా కళ్యాణం', 'దేవత', 'శివరంజని' వంటి పలు సీరియల్స్‌లో నటించారు.
ఓ సీరియల్ సమయంలో ఏర్పడిన పరిచయంతో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. 2017లో నటుడు సంతోష్ పవన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి చందమామ అనే కుమార్తె ఉంది.సోషల్ మీడియాలో ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది.అంజలి తన భర్త పవన్, కుమార్తె ధన్విక (చందమామ)తో కలిసి యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

తాజాగా ఆమె రెండోసారి తల్లి అయ్యారు. కొద్దిరోజుల క్రితం తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన అంజలి, తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. "ఫుల్ వీడియో కమింగ్ సూన్ విత్ చందమామ" అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, పుట్టిన బిడ్డ పాపో బాబు తెలియజేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications