తల్లి కాబోతున్న అంజలి.. అతనే కారణమంటూ వీడియో
వెండితెరకు ఏమాత్రం తీసిపోని విధంగా బుల్లితెర నటులు కూడా ఆకట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే వెండితెరకు ధీటుగా బుల్లితెర నటులు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా సీరియల్స్ నటులు తమ నటనతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టి పడేస్తున్నారు. బుల్లితెరపై నటి అంజలికి మంచి క్రేజ్ ఉంది. 'మొగలిరేకులు' సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత 'రాధా కళ్యాణం', 'దేవత', 'శివరంజని' వంటి పలు సీరియల్స్‌లో నటించారు.ఆమెకు ఇదివరకే చందమామ అనే కుమార్తె ఉంది. 2017లో నటుడు సంతోష్ పవన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి చందమామ అనే కుమార్తె ఉంది. తాజాగా ఈ బ్యూటీ తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. అంజలి తాను రెండోసారి గర్భవతి అనే సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఈ శుభవార్తను తెలియజేస్తూ ఆమె ఒక ప్రత్యేకమైన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో, మొదట తన కుమార్తెకు తమ్ముడు లేదా చెల్లి రాబోతున్నాడని చెప్పగా, ఆ తర్వాత భర్తకు ఈ విషయాన్ని తెలియజేసి ఆయనను ఎమోషనల్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, మరియు అంజలి సహ నటీనటులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంజలి కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వారి కుటుంబంలోకి కొత్త సభ్యుడు రాబోతుండటంతో అంతటా సంతోషకరమైన వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications