ఆ స్టార్ హీరో అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడా..? సోషల్ మీడియాలో వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తన గురించి కాకుండా..తన భార్య వల్ల వార్తల్లో నిలవడం విశేషం. ఆ వివరాల్లోకి వెళ్తే..బాలీవుడ్ యంగ్ హీరోల్లో షాహిద్ కపూర్ కూడా ఒకరు. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ..వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఎఫైర్ల విషయంలో కూడా షాహిద్ ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌తో షాహిద్ ప్రేమయాణం సాగించాడు. వీరిద్దరు కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్నారు.
పెళ్లి చేసుకుంటానుకున్న వీరిద్దరు అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడిపోయారు. షాహిద్‌తో బ్రేకప్ తర్వాత సైఫ్ అలీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇదే సమయంలో షాహిద్ పలువురు హీరోయిన్స్‌తో ఎఫైర్ సాగించినప్పటికీ.. చివరికి మీరా రాజ్ పుత్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు.అయితే మీరా రాజ్ పుత్ హీరోయిన్స్‌తో సమానంగా అందాన్ని మెయింటేన్ చేయడంతో పాటు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో సెలబ్రిటీగా మారిపోయింది. షాహిద్ భార్య మీరా చేసిన ఓ పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మీరా రాజ్ పుత్‌కు తాజాగా షో స్టాపర్‌గా అవకాశం దక్కించుకుంది.

హీరోయిన్లను, మోడల్స్ ను కాదని మీరాకు ఛాన్స్ ఇచ్చారు నిర్వహకులు. అయితే మీరా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. బ్యూటిఫుల్ లెహంగలో ర్యాంప్ వాక్ చేసిన ఆమె అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా నడిచిందనే విమర్శలు వచ్చాయి.దీంతో ఆమెపై ఘోరంగా ట్రోలింగ్ జరుగుతోంది. 'దబాంగ్' సినిమాలో సల్మాన్ ఖాన్ లా ఆ వాకింగ్ స్టైల్ ఏంటి అని మీరాను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. షాహిద్ పెళ్లి చేసుకుంది అమ్మాయిను అబ్బాయినేనని ఈ వీడియో చూసిన తరువాత అర్థం అయిందంటూ మరికొందరు హేళనగా మాట్లాడుతున్నారు. షాహిద్ భార్య మీరా రాజ్ పుత్ వాక్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications