కొడుక్కి న్యాయం చేసిన షారూఖ్.. కుతుర్ని గట్టెక్కిస్తారా ??

బాలీవుడ్ "బాద్‌షా".. షారూఖ్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఏమాత్రం సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి "కింగ్ ఖాన్" గా ఎదిగారు. 1992లో 'దీవానా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 'బాజీగర్', 'డర్' వంటి సినిమాల్లో నెగటివ్ పాత్రలు పోషించి, నటుడిగా తనలోని వైవిధ్యాన్ని చాటుకున్నారు. 1995లో వచ్చిన 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' (DDLJ) షారుఖ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో ఆయన గ్లోబల్ స్టార్‌ గా మారిపోయారు. అలానే 'కుచ్ కుచ్ హోతా హై', 'దేవదాస్', 'వీర్-జారా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.

కాగా కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా.. 'స్వదేశ్', 'చక్ దే ఇండియా', 'మై నేమ్ ఈజ్ ఖాన్' వంటి చిత్రాల ద్వారా నటుడిగా తన సత్తా చాటారు. మధ్యలో పలు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయినప్పటికీ.. 2023లో 'పఠాన్', 'జవాన్' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి, తానెప్పుడూ 'కింగ్' అని నిరూపించుకున్నారు. ఇటీవల 'జవాన్' చిత్రానికి గాను ఆయన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నారు.

shahrukh-khan-and-suhana-khan-starring-king-movie-directed-by-siddharth-anand-latest-news

కాగా ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్‌ సిద్ధార్థ్ ఆనంద్ తో చేతులు కలిపి "కింగ్‌" సినిమా చేస్తున్నారు షారుఖ్‌. ఈసారి యాక్షన్ మాత్రమే కాకుండా.. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌ కూడా ఉంటుందని జోరుగా టాక్ నడుస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన "పఠాన్" మూవీతోనే షారుక్‌ ఖాన్‌ మొదటిసారి వెయ్యికోట్ల కలెక్షన్స్ అందుకున్నారు. కానీ "ఢంకీ" సినిమాతో కొంచెం ఢీలా పడ్డ షారూఖ్.. ఈసారి గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా 'కింగ్' సినిమా థియేటర్లలోకి రానుంది.

అంతే కాకుండా కింగ్ సినిమాలో హైలైట్ గా నిలిచే మరో అంశం ఏంటంటే.. ఈ చిత్రంలోనే షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వెండితెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే "ది ఆర్చీస్" అనే ఓటీటీ మూవీలో మెరిసిన సుహానా.. ఇప్పుడు తన తండ్రితో కలిసి పూర్తిస్థాయి యాక్షన్ రోల్‌లో కనిపించనుంది. రియల్ లైఫ్ తండ్రీకూతుళ్లు.. రీల్ లైఫ్‌లో కూడా ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీతో కూడా మరోసారి వెయ్యి కోట్లు కలెక్ట్‌ చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్‌ చేయాలని కోరుకుంటున్నారు. మరి దర్శకుడిగా కొడుక్కి హిట్ అందించిన షారూఖ్.. కూతురిని కూడా గట్టెక్కిస్తారా అనేది వేచి చూడాల్సిందే..

shahrukh-khan-and-suhana-khan-starring-king-movie-directed-by-siddharth-anand-latest-news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+