ఒకప్పుడు వ్యభిచారం చేసింది.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్, హీరోలు సైతం పరార్
ఓ స్టార్ హీరోయిన్ తల్లి కోసం వ్యభిచారం చేసింది. సొంత తల్లే ఆమెను వ్యభిచారంలోకి నెట్టింది. డబ్బు కోసం చాలామంది మగవాళ్ల దగ్గర పడుకోబెట్టింది.ఆమె మరెవరో కాదు షకీలా. ఈ తరం ప్రేక్షకులకు షకీలా గురించి పెద్దగా తెలియక పోవచ్చు. కానీ 1990ల్లో షకీలా అంటే తెలియని సినీ అభిమాని ఉండేవారు కాదు.షకీలా 1973 నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించారు.
"ప్లేగర్ల్స్" అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన షకీలాకు "కిన్నెర తుంబికళ్" సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మళయాళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ శృంగారభరిత సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. షకీలా నుంచి సినిమా వస్తుందంటే స్టార్ హీరోలు హడలెత్తిపోయేవారు.మళయాళంలో ఓ వెలుగు వెలుగుతున్న మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునే వారు.షకీలా సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉండేది.మళయాళంతో పాటు, తెలుగు, తమిళ సినిమాల్లో షకీలా నటించారు.

అంతలా షకీలా అక్కడ క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే తెర మీద ఓ వెలుగు వెలిగిన షకీలా నిజ జీవితంలో అన్ని కష్టాలే. జన్మనిచ్చిన తల్లే ఆమెను వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసింది.ఈ విషయాన్ని షకీలానే ఓ ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. ఈ పనికి ఒప్పుకోకపోతే, అమ్మ నన్ను తీవ్రంగా కొట్టేదని, ఆ బాధపడలేక ఆమె చెప్పినట్టు చేసేదాన్ని అని షకీలా చెప్పుకొచ్చింది. అలా అలవాటు అయ్యే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చానని ఆమె తెలిపింది.
సినిమాల్లో కూడా తన శరీరాన్ని చూసేవారే కానీ, నా నటనను ఎవరు చూడలేదని ఎమోషనల్ అయింది. సినిమాల్లో డబ్బులను కూడా షకీలా కాపాడుకోలేకపోయారు. ఆమె బంధువులే షకీలా ఆస్తిని కాజేశారు. ఇలా ఓ వెండితెరపై ఓ వెలుగు వెలిగిన షకీలా నిజ జీవితంలో మాత్రం కష్టాలను ఫేస్ చేశారు.షకీలా జీవిత కథ ఆధారంగా ఓ సినిమా కూడా వచ్చింది.షకీలా పేరుతో వచ్చిన ఈ సినిమాలో రిచా చద్దా హీరోయిన్‌గా నటించింది.












Click it and Unblock the Notifications