అతను మోసం చేశాడు..అబ్బాయిలతో కలిసి రూమ్‌లో..తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఇండస్ట్రీలో నిలబడాలంటే చాలానే కష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. హీరోయిన్ అన్నాక చిత్ర పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఉంటాయి. అన్నింటిని అధికమించిన వారే సక్సెస్ ఫుల్ అవుతారు. కొన్నిసార్లు అండగా నిలబడాల్సిన మనుషులే మోసం చేస్తుంటారు.

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌‌గా మారిపోయిన షాలిని పాండే జీవితంలో కూడా ఇలాంటి కథ ఒకటి ఉంది. . అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత ఇద్దరి లోకం ఒకటే, మహానటి, నిశ్శబ్దం, 118 వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ తర్వాత తెలుగులో అరకొర సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించినప్పటికి అవి కూడా ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.

Shalini Pandey about career strugles

షాలిని పాండే చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమా లేవని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షాలిని పాండే.. తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. షాలిని పాండే ప్రస్తుతం 'మహారాజ్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న షాలిని పాండే ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో బాడీ షేమింగ్ కి గురయ్యానని షాలిని పాండే పేర్కొంది. నా బాడీ గురించి, నా కలర్ గురించి చాలా మంది ఇబ్బందికరంగా మాట్లాడేవారు. ఆ సమయంలో నాకు పెద్దగా ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదని ఈ భామ చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో నా మాజీ మేనేజర్ నన్ను మోసం చేశాడని.. నా అమాయకత్వాన్ని వాడుకున్నారు. దీనితో చాలా నష్టపోయానని ఈ హాట్ తెలిపింది.

ఫ్యామిలిలో కూడా నాకు ఇబ్బందులు తప్పలేదు. దీనితో ఇంట్లో నుంచి పారిపోయి ముంబై వచ్చేశా..అప్పుడు స్నేహితుల రూంలో కలిసి ఉన్న,కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళతో ఉండలేకపోయా. చివరకి కొందరు అబ్బాయిలు ఉంటున్న రూమ్ ని షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు మంచి వాళ్ళు.. నెమ్మదిగా వాళ్ళు నా కుటుంబంలా మారిపోయారు అని షాలిని పాండే తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+