ఒకటి ఫుల్ క్లాస్.. ఇంకోటి ఊర మాస్.. ఫుల్ జోష్ లో యంగ్ హీరో !!
టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో "శర్వానంద్". శంకర్ దాదా ఎంబీబీఎస్, సంక్రాంతి, లక్ష్మీ సహా పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత హీరోగా ప్రస్థానం, గమ్యం వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. 2014లో విడుదలైన రన్ రాజా రన్ ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు వంటి చిత్రాలతో కమర్షియల్ విజయాలను అందుకున్నారు. గత కొంతకాలంగా మాత్రం వరుస ఫ్లాప్ లతో కొంచెం వెనుకపడ్డారు.
కానీ ఈసారి మాత్రం తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి సీజన్ లో "నారీ నారీ నడుమ మురారి" మళ్లీ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చేశారు. చాలాకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఈ మూవీ భారీ హిట్ అవ్వడం ఫుల్ ఖుషి ఇస్తుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నేడు శర్వానంద్ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి.

ఒకటి ఫుల్ క్లాస్.. ఇంకోటి ఊర మాస్
ముందుగా శర్వానంద్ నటిస్తున్న చిత్రాల్లో 'బైకర్' ఒకటి. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆయన ఒక ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాను డాల్బీ సినిమా, EPIQ, 4DX వంటి ప్రీమియం ఫార్మాట్స్‌లో నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరో రాజశేఖర్ 'బుల్లెట్ సునీల్' అనే ఎక్స్ మోటోక్రాస్ లెజెండ్ పాత్రలో కనిపిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫుల్ క్లాస్ రోల్ లో మెప్పిస్తున్నారు.
A man who rebuilt himself, broke every limit, and rode into #Biker with blood, sweat, and pure fire 🔥
— UV Creations (@UV_Creations) March 6, 2026
Happy B’Day Charming Star @ImSharwanand ✨
Experience 𝐈𝐍𝐃𝐈𝐀’𝐒 𝐅𝐈𝐑𝐒𝐓 𝐌𝐎𝐓𝐎𝐂𝐑𝐎𝐒𝐒 𝐅𝐈𝐋𝐌 in Dolby Cinema, EPIQ, 4DX and PCX. ❤️🔥#Biker Grand release on… pic.twitter.com/FkBYHH2ez5
అలానే శర్వానంద్ నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'భోగి'. సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా 1960ల నాటి తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కుతుంది. శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో పక్కా ఊరమాస్ లుక్‌లో శర్వానంద్ మెప్పిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 28న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఒకేరోజు రెండు భారీ చిత్రాల రిలీజ్ డేట్స్ రావడంతో శర్వానంద్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. రెండు సినిమాల అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాలో శర్వానంద్ పేరు ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
మొన్న గంగని చూసిర్రు..
— Sampath Nandi (@IamSampathNandi) March 6, 2026
ఇయ్యాల పెనుగంగని సూడుర్రి💥
Happiest Birthday to my G.A.N.G.A, Charming Star💫@ImSharwanand garu 💐✌🏾🫶🏽
A man who gives his absolute all to what he believes in & an ever-surprising powerhouse ✨🫡#HBDSharwanand #BHOGI
A #SharwaSampathBloodfest❤️🔥… pic.twitter.com/HEU1aEgXoZ
-
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
రీసెంట్ టైమ్ లో బెస్ట్ టీజర్.. నవ్వి నవ్వి పొట్ట చెక్కలే..!! -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ??












Click it and Unblock the Notifications