మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో విలన్ ఫిక్స్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 2026 సంక్రాంతి కానుకగా సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'మీసాల పిల్ల' సాంగ్ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు షైన్ స్క్రీన్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొనేదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

చిరు మూవీలో దసరా విలన్‌..

కాగా ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సినిమాలో విలన్ పాత్రను దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం. ఆ పాత్రను షైన్ టామ్ చాకో పోషించనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ పాత్రకు సరిపడే ఇమేజ్‌, బాడీ లాంగ్వేజ్‌, నటన ఉన్న వ్యక్తిగా షైన్ టామ్ చాకోను ఎంపిక చేయాలని అనిల్ నిర్ణయించారట. ఇప్పటికే షైన్ టామ్‌తో చిత్రబృందం చర్చలు జరిపి, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందంటున్నారు.

shine-tom-chacko-going-to-act-as-villain-in-megastar-anil-ravipudi-movie

షైన్ టామ్ చాకో ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం మూడు భాషల్లోనూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ప్రముఖ చిత్రాల్లో రంగబలి, దేవర, దాకు మహారాజ్, రాబిన్ హుడ్ ఉన్నాయి. ముఖ్యంగా 'దసరా' సినిమా తర్వాత ఆయనకు దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు చిరంజీవి సినిమా ద్వారా ఆయన మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటివరకు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించాయి. ఆయన తెరకెక్కించిన చివరి చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడమే కాకుండా ఆస్కార్ రేసులో నిలిచి ఘనత సాధించింది. ఈ నేపధ్యంలో ఆయన చిరంజీవితో చేస్తున్న కొత్త సినిమా పట్ల కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మొత్తానికి అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్‌, చిరంజీవి స్టైల్ యాక్షన్‌, నయనతార గ్లామర్‌, షైన్ టామ్ చాకో ఇంటెన్స్ విలనిజం కలిసి ఈ చిత్రం 2026లో టాలీవుడ్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశముందని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+