యాంకర్ శివ జ్యోతి బాత్ రూమ్ వీడియో వైరల్
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు యాంకర్ " శివ జ్యోతి " సుపరిచితురాలే. 'తీన్మార్' వార్తల్లో "సావిత్రక్క"గా పాపులర్ అయిన ఆమె, దానికి ముందు న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. తెలంగాణ యాసతో ప్రేక్షకులకు చేరువై పలు టీవీ షోలలో యాంకరింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఆ పాపులారిటీ తోనే బిగ్‌బాస్ సీజన్ 3 లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 98 రోజులు హౌస్‌లో ఉండి మేల్ కంటస్టెంట్స్ కి కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల మరింత స్థానం సంపాదించుకుంది అని చెప్పొచ్చు. బిగ్‌బాస్‌కి ముందు కూడా ఆమె యాంకరుగా ప్రసిద్ధి చెందారు కానీ షో తర్వాత ఆమెకు వచ్చిన గుర్తింపు మరో స్థాయిలో ఉంది. ఈ జోష్‌తో ఆమె ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ, భర్తతో కలిసి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు.

అయితే లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన బాత్‌రూమ్ వీడియోపై వివాదం నెలకొంది. "భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా?" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. గ్లామర్ విషయంలో ఎప్పుడూ హద్దులు పాటించే శివజ్యోతి.. ఈమధ్య కాస్త అందాలు ఆరబోస్తున్నట్టు కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా స్నానం చేస్తున్న వీడియో పోస్ట్ చేయడంతో అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేసిందా అంటూ ఓపెన్ గానే డిస్కషన్ నడుస్తోంది.

శివజ్యోతి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న 'గంగులు' అనే వ్యక్తిని పెళ్లాడి జీవితాన్ని సాగిస్తున్నారు. గంగులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడగా.. ఆయన కూడా శివజ్యోతితో కలిసి టీవీ షోలు, యూట్యూబ్ వీడియోల్లో కనిపిస్తూ గుర్తింపు పొందారు.












Click it and Unblock the Notifications