పవన్ కల్యాణ్, మహేష్ బాబుపై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
కన్నడ చిత్ర సీమలో శివరాజ్ కుమార్ మంచి క్రేజ్ ఉన్న హీరో. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే శివన్నను ట్విటర్ వేదికగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మహేష్ బాబు, పవన్ కల్యాణ్ పై అభిప్రాయం చెప్పాలని అభిమానులు కోరారు. ఆయన చెప్పిన సమాధానం సంచలనంగా మారింది.
శక్తివంతంగా అతిథి పాత్ర : తాజాగా రజనీకాంత్ నటించిన జైలర్ లో అతిథి పాత్ర పోషించారు. తన నటనకు ఎటువంటి శక్తి ఉంది అనే విషయాన్ని మారోమారు దీనిద్వారా చెటిచెప్పారు. తాజాగా ఘోస్ట్ సినిమాతో అక్టోబరు 19వ తేదీన రాబోతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఒక పాత్రను పోషించారు. తెలుగులో అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్న పవన్ కల్యాణ్, మహేష్ బాబు గురించి అభిప్రాయం చెప్పాలని ట్విటర్ వేదికగా కోరారు. ఆయన చెప్పిన తీరు అందరినీ విస్మయపరిచింది.

సినిమాను బాగా ప్రేమిస్తాడు : మహేష్ బాబు సినిమాని చాలా ఎక్కువగా ప్రేమిస్తాడని ,చాలా తక్కువగా మాట్లాడుతూ తన పని తాను చేసుకుంటాడన్నారు. మహేష్ ని తెరపై చూడటం తనకు చాలా ఆనందంగా ఉంటుందని శివన్న చెప్పారు. పవన్ కల్యాణ్ ఎన్నో సంవత్సరాల నుంచి తనకు మంచి స్నేహితుడన్నారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే పవన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. ఈ ఇద్దరు హీరోల గురించి శివరాజ్ కుమార్ చెప్పిన మాటలపై మహేష్ బాబు, పవన్ కల్యాణ్ అభిమానులు ఆనందపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications