భర్త స్టార్ క్రికెటర్...మరో పెళ్లికి సిద్దమైన హీరోయిన్
టెన్నిస్ సంచలనం సానియా మీర్జా విడాకుల గురించి అందరికి తెలిసిన విషయమే. పాకిస్థాన్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్‌ను సానియా 2010లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇజాన్ మీర్జా అనే మగబిడ్డ ఉన్నాడు. అయితే సానియా మీర్జా -షోయబ్ మాలిక్ సంసార జీవితంలో విభేదాలు రావడం ఈ జంట విడాకులు తీసుకున్నారు.పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్ కారణంగానే సానియా మీర్జా షోయబ్ మాలిక్‌కు విడాకలు ఇచ్చింది. సానియా మీర్జాతో వైవాహిక జీవితంలో ఉండగానే షోయబ్ మాలిక్ సనా జావేద్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడని..ఆ కారణంగా సానియా అతనికి విడాకులిచ్చిందని సమాచారం.
సానియాకు విడాకులిచ్చిన తర్వాత షోయబ్ మాలిక్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే తాజాగా వీరి వైవాహిక జీవితం గురించి కూడా అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సనా జావేద్ సైతం షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతుందని పాక్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతున్నాయి. సనా జావేద్‌కు షోయబ్ మొదటి భర్త కాదు. ఆమె పాకిస్థాన్‌కు చెందిన సింగర్ ఉమర్ జస్వాల్‌ను మొదటి వివాహం చేసుకుంది. ఆ తర్వాత షోయబ్‌తో పరిచియం ఏర్పడటం అది ప్రేమగా మారడంతో ఉమర్ జస్వాల్‌కు విడాకులిచ్చి..షోయబ్‌ను రెండో వివాహం చేసుకుంది.

తాజాగా సనా జావేద్‌కు సంబంధించిన వీడియో ఒకటి మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యాంకర్ ఎలాంటి భర్త కావాలని తనను ప్రశ్నించగా.. తనకు గౌరవం ఇచ్చేవాడే కావాలని అంది. తనకు బ్రాడ్లీ కూపర్ లాంటి హజ్బెండ్ కావాలని చెప్పింది. కానీ ఆ తర్వాత షోయబ్‌ను రెండో వివాహం చేసుకుంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు రియాక్ట్ అవుతూ.. మొదటి భర్తతో కేవలం మూడు ఏళ్లు మాత్రమే కాపురం చేసిన ఆమె.. రెండో భర్తకు రెండేళ్లలో గుడ్ బై చెప్పేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications