నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి.. కానీ తాతయ్య కోరిక అదే - శోభన్ బాబు మనవడు
తెలుగు సినీ చరిత్రలో అందగాడు, సోగ్గాడు అనగానే గుర్తొచ్చే పేరు శోభన్ బాబు అంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్ కి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు లాంటి వారు అని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత తరంలో కృష్ణ, కృష్ణం రాజులతో పాటే సూపర్ స్టార్ గా ఎదిగారు శోభన్ బాబు. తనదైన నటనతో, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ మహానటుడు, తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నారు.
అయితే తన కుటుంబ సభ్యులను మాత్రం సినిమా రంగానికి పరిచయం చేయకుండా దూరంగా ఉంచారు. కానీ ఆయన వారసులు మాత్రం ఇతర రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ శోభన్ బాబు పేరును నిలబెడుతున్నారు. ఆ క్రమంలోనే ఆయన మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన, వైద్య రంగంలో ఓ అద్భుత విజయాన్ని సాధిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నైలో ప్రముఖ గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ సురక్షిత్ ఇటీవల ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశారు. 44 ఏళ్ల మహిళ గర్భాశయంలో ఏర్పడిన 4.5 కిలోల సిస్టును, సాధారణంగా ఓపెన్ సర్జరీ చేయాల్సిన స్థితిలో ఉన్నా, అత్యాధునిక "ట్రూ 3డి ల్యాపరోస్కోపిక్" పద్ధతిలో తొలగించి చరిత్ర సృష్టించారు.

ఈ మేరకు అప్పటి నుంచి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూన్నాడు వస్తోన్న సురక్షిత్. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. సురక్షిత మాట్లాడుతూ.. తాతయ్య శోభన్ బాబు తన కుటుంబ సభ్యులను సినిమా ఇండస్ట్రీకి వద్దని చెప్పలేదని.. కానీ ఆయన కష్టాన్ని చూసి మేము ఆ ప్రయత్నం చేయలేదని చెప్పుకొచ్చారు. తనకు చాలా పెద్ద పెద్ద ఆఫర్లు కూడా వచ్చాయని స్పష్టం చేశారు.
చిన్నప్పటి నుంచి తాను డాక్టర్ కావాలని తాతయ్య కోరుకున్నారని వెల్లడించారు. అందుకే ఆయన కోరిక ప్రకారం డాక్టర్ అయ్యానని.. ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్న అంటూ చెప్పుకొచ్చారు. హీరోలకు ఏ మాత్రం తీసుపోకుండా ఉండే సురక్షిత్.. ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలవడం ప్రేక్షకుల్లో సైతం తన గురించి ప్రస్తావన వస్తూ ఉండడంతో ఇప్పటికే పలు ఆఫర్లు వచ్చాయని చెప్తున్న తరుణంలో రానున్న రోజుల్లో మరిన్ని ఆఫర్లు రావడం పక్కా అంటూ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications