సమంత... శోభిత... అక్కినేని కుటుంబానికి పెళ్లిళ్లు కలిసిరావడంలేదా?
అక్కినేని కుటుంబం అంటే తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమలోనే అతి పెద్ద కుటుంబంగా పేరు తెచ్చుకుంది. అన్నపూర్ణ స్టూడియో నిర్వహణతోపాటు పలురకాల వ్యాపారాలు చేస్తూ నాగార్జున అక్కినేని కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. పెద్ద తనయుడు నాగచైతన్య సమంతను ప్రేమిస్తే ఇద్దరికీ పెళ్లి చేశారు. మనస్పర్థలు, ఇతర కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. తర్వాత కొంతకాలానికి నాగచైతన్య శోభితను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట హైదరాబాద్ లోనే నివసిస్తోంది. బాలీవుడ్ నుంచి ఎక్కువ అవకాశాలు వస్తుండటంతో కాపురాన్ని అక్కడకు మార్చాలనే యోచనతో శోభిత ఉంది.
ప్రత్యేక కాపురానికి నాగార్జున ఓకే
నాగార్జున ఇంటినుంచి వెళ్లిపోయి ప్రత్యేకంగా కాపురం పెడదామని నాగచైతన్యను విసిగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడే వద్దని, కొంతకాలం ఆగుదామని నాగచైతన్య చెబుతున్నాడు. అయినప్పటికీ శోభిత వినడంలేదు. దీంతో ఈ విషయం నాగార్జున దగ్గరకు వెళ్లడంతో ఇద్దరూ సంతోషంగా ఉంటానంటే వేరే కాపురం పెట్టడంలో తనకేం అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇద్దరూ వేరుగా కాపురం పెడతామంటే తనకు సంతోషమేనన్నారు. దీంతో ఫ్లాట్ కోసమా, లేదంటే విల్లానే అనే వేటలో ఈ జంట ఉంది. పెళ్లయి రెండు నెలలు కూడా కాకముందే వేరే కాపురం పెడదామనే ఆలోచన ఎందుకని శోభితను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

పెళ్లిళ్లు కలిసిరావడంలేదా?
అక్కినేని కుటుంబానికి పెళ్లిళ్లు కలిసిరావడంలేదా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చ పెడుతున్నారు. గతంలో సమంతను వివాహం చేసుకున్న తర్వాత ఆమె కూడా ప్రత్యేకంగా కాపురం పెడదామనడంతో మురళీమోహన్ ఫ్లాట్ తీసుకొని అందులో ఉన్నారు. గ్లామర్ షో చేయడంపై అక్కినేని కుటుంబం సమంతకు అభ్యంతరం తెలిపింది. అలాగే శోభిత కూడా వేరే కాపురం పెట్టనుండటంతోపాటు గ్లామర్ షో చేస్తుండటం వీరి కుటుంబానికి పెద్ద తలనొప్పిని కలిగిస్తోందంటున్నారు. ఏదేమైనప్పటికీ అప్పుడు సమంత, ఇప్పుడు శోభిత.. ఇద్దరూ నాగచైతన్యకు సంతోషాన్ని మాత్రం మిగల్చకుండా చేస్తున్నారని, ఇద్దరూ భర్త చెప్పిన మాట వినకపోతుండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications