పెళ్లై 4 రోజులు కాకుండానే చిర్రుబుర్రులా?
అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత ఈనెల నాలుగోతేదీన అన్నపూర్ణ స్టూడియోలో శోభిత ధూళిపాళను వివాహమాడారు. నిరాడంబరంగా జరిగిన ఈ వివాహానికి కేవలం 300 మంది అతిథులు హాజరయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా ఈ జంట బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కాశ్యప్ కుమార్తె అలియా క్యాసన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఈ జంట హాజరైంది. తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ భార్యాభర్తలుగా ఈ కార్యక్రమంలోనే మీడియా కంట పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.
తనొక్కదాన్నే దిగమన్నాడు
ఈ సందర్భంగా శోభిత-నాగచైతన్య ఫొటోలు దిగుతారని అనుకున్నారు. శోభిత ఫొటోలు దిగడానికి నాగచైతన్యను పిలవగా తనొక్కదాన్నే వెళ్లి దిగమని చైతూ చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ముఖం చిన్నబుచ్చుకున్న శోభిత తన అసంతృప్తిని ఫొటోగ్రాఫర్లకు కనిపించకుండా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. వివాహమై నాలుగు రోజులు కూడా కాకుండానే ఇద్దరిమధ్య చిర్రుబుర్రులాటలు చోటుచేసుకుంటున్నాయని నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి నాగచైతన్య నిరాడంబరంగా ఉండటానికి ఇష్టపడతాడు. ప్రతి చిన్న విషయానికి ఫొటోలు దిగడం కూడా తనకు ఇష్టం ఉండదు. వాస్తవానికి పెళ్లి కూడా రెండోది కావడంతోనే ఆర్భాటం వద్దని తన తండ్రి నాగార్జునకు చెప్పి కేవలం చాలా నిరాడంబరంగా, అతికొద్దిమంది అతిథులు, బంధువుల మధ్య వివాహమాడారు.

చైతూ కూడా ఫొటో దిగితే బాగుండేది
కొందరు నెటిజన్లు మాత్రం నాగచైతన్య కూడా శోభిత పిలవగానే వెళ్లి ఫొటోలు దిగితే బాగుండేదని, పెళ్లయిన తర్వాత తొలిసారిగా ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు కాబట్టి కలిసి ఫొటోలు దిగడం సమంజసమేనని అంటున్నారు. ఏదేమైనప్పటికీ పెళ్లయిన కొత్తలోనే భార్య అభిప్రాయాన్ని భర్త, భర్త అభిప్రాయాన్ని భార్య గౌరవించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా శోభిత చీర కట్టుకొని వస్తే బాగుండేదని వ్యతిరేక వ్యాఖ్యలు వస్తున్నాయి. ప్రస్తుతానికి వీరిద్దరికి సంబంధించిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ప్రస్తుతం సాయిపల్లవితో తండేల్ సినిమా చేస్తున్నారు నాగచైతన్య. శోభిత బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేస్తోంది. వీరిద్దరూ తమ కాపురాన్ని ముంబయిలో పెట్టే అవకాశం ఉందంటున్నారు. తండేల్ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. రూ.100 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి.












Click it and Unblock the Notifications