సమంతకు దిమ్మతిరిగే కౌంటర్.. రాజ్ నిడమోరు భార్య పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్, కుందనపు బొమ్మ " సమంత " అటు సినిమాలు.. ఇటు వెకేషన్ అటూ ఎంజాయ్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ కంటే కూడా పర్సనల్ లైఫ్ విషయాలతోనే సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆమె అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంచెం గ్యాప్ ఇవ్వడం.. తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇక రీసెంట్ గానే నాగ చైతన్య మళ్లీ వివాహం చేసుకోగా.. సామ్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమోరుతో రిలేషన్ లో ఉన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.
డేటింగ్ వార్తలను మరింత నిజం చేసేలా కొంతకాలంగా ఆమె చేస్తున్న ప్రతి పోస్టులోనూ రాజ్ నిడిమోరుతో ఫోటోలను పోస్ట్ చేస్తుంది సామ్. ఇప్పుడు మరోసారి రాజ్‌తో కలిసి వెకేషన్‌లో దిగిన ఫొటోలను సమంత షేర్ చేశారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారగా.. రాజ్ సతీమణి శ్యామాలి తాజాగా ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా సమంతకు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు.

శ్యామాలి కౌంటర్..
మతమేదైనా మన చర్యలతో ఇతరులను బాధించవద్దు అనే చెబుతుందని.. అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమమని పలు భాషల్లో అక్కడ రాశి ఉంది. సామ్ - రాజ్ ఫొటోలు వైరల్‌గా మారిన వెంటనే శ్యామాలి పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆ ఫొటోల కారణంగా ఆమె బాధపడి ఉండొచ్చని.. అందుకే ఈ స్టోరీ పెట్టారని భావిస్తున్నారు.
గతంలో కూడా..
శ్యామాలి చివరిసారి 2023లో రాజ్‌తో కలిసున్న ఫొటోను షేర్ చేశారు. వీరిద్దరూ విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. వాటికి ఆజ్యం పోసేలా సమంత పోస్టులు పెడుతున్నప్పటి నుంచి శ్యామాలి ఈ తరహా పోస్ట్‌లు షేర్ చేశారు. కొన్నిరోజుల క్రితం నమ్మకం, కర్మ సిద్ధాంతం గురించి పోస్టులు పెట్టారు. నమ్మకాన్ని ఒక్కసారి కోల్పోతే ఎంత ఖర్చు పెట్టినా తిరిగి పొందలేమని కొన్నిరోజుల క్రితం ఆమె రాసుకొచ్చారు. ''కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది'' అంటూ కూడా ఒక సందేశాన్ని షేర్ చేశారు.

సమంత ఏం పోస్ట్ చేసిందంటే..?
కాగా సమంత ప్రస్తుతం వెకేషన్‌ను ఆస్వాదిస్తున్నారు. అందమైన లొకేషన్స్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమంత షేర్ చేసిన ఫొటోలలో రాజ్ నిడిమోరు సైతం ఉండడం.. సమంత భుజంపై ఆయన చేసి వేసి ఉండడం గమనించవచ్చు. దీంతో ఈ జంట అఫిషియల్ గా తమ రిలేషన్ గురించి వెల్లడిస్తున్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
రాజ్- డీకే దర్శకత్వంలో వచ్చిన 'ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2', 'సిటడెల్: హనీ బన్నీ'లో సమంత నటించారు. ఆ సమయంలోనే రాజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి రిలేషన్ కి దారి తీసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల సమంత నిర్మించిన 'శుభం' చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. అంతే కాకుండా వారు తెరకెక్కించిన సినిమా బండి మూవీలోని క్యారెక్టర్స్ ని ఈ చిత్రంలో కూడా లింక్ చేశారు. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ఓపెన్ అవ్వకపోయినా కూడా.. సమంత ఎక్కడికి వెళ్లినా.. రాజ్ కూడా వెంట ఉండటం ఈ పుకార్లను మరింత నిజం చేస్తుంది.












Click it and Unblock the Notifications