పొలిమేర బ్యూటీ కొత్త సినిమా ఫస్ట్ లుక్ చూశారా..?

నవీన్ చంద్ర హీరోగా , పొలిమేర బ్యూటీ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించిన చిత్రం 'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 1 బ్యానర్‌పై కిషోర్ గరికిపాటి నిర్మిస్తున్నారు.ఉగాది సందర్భంగా ఆదివారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్‌లో నవీన్ చంద్ర ,కామాక్షి భాస్కర్లతో పాటు, చిన్న పాప కూడా కనిపించింది. ఫస్ట్ లుక్‌ను చూస్తుంటే.. కుటుంబం ఊహించని సమస్యల్లో ఎదుర్కున్నప్పుడు.. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని చూసే కథగా 'షో టైమ్' తెరక్కెక్కినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రానికి మధన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.

Show Time movie first look released

ఇది ఒక ఫ్యామిలీ డ్రామా మరియు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలోని కథ, ఒక కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి ఎలా బయటపడ్డారనే కాన్సెప్టుతో రూపొందుతుంది.శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు.శరత్ కుమార్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ గవిరెడ్డి సంభాషణలు రాస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర ఒక పోలీస్ అధికారిగా నటిస్తున్నారు.నవీన్ చంద్రకు సస్పెన్స్ చిత్రాల్లో నటించి అనుభవం ఉంది. అటు కామాక్షి భాస్కర్ల సైతం 'మా ఊరి పొలిమేర' మంచి గుర్తింపు దక్కించుకున్నారు. దీంతో 'షో టైమ్'సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+