అల్లు అర్జున్‌కు నో చెప్పి, ఎన్టీఆర్‌కు ఓకే చెప్పిన బ్యూటీ

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చిత్రంతో ప్రేక్షకు ముదుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబరు ఐదోతేదీన విడుదలవుతుందా? లేదా? అనే టెన్షన్ లో బన్నీ అభిమానులున్నారు. పుష్ప1 సూపర్ హిట్ అవడంలో కీలక పాత్ర పోషించింది ఐటం సాంగ్. తిరిగి పుష్ప2లో కూడా దర్శకుడు సుకుమార్ ఐటంసాంగ్ ప్లాన్ చేసి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ చేత చేయిద్దామని చాలా ప్రయత్నించారు. అయితే శ్రద్ధ రూ.10 కోట్ల పారితోషికం అడగడంతో ఆమెతో చేయించాలనే ఆలోచన విరమించుకొని నాలుగు నిముషాల పాటను డాన్సింగ్ క్వీన్ గా పేరున్న శ్రీలల చేత చేయించారు.

మంచి మాస్ స్టెప్పులు ప్లాన్ చేశారు
స్త్రీ2 సినిమా ద్వారా రూ.650 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి టాప్ రేంజ్ లో ఉన్న శ్రద్ధాకపూర్ జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వార్2 సినిమాలో ఐటం సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. ఈ సినిమాకు దర్శకుడు అయాన్ ముఖర్జీ. తారక్, హృతిక్, శ్రద్ధాకపూర్ చేత మంచి మాస్ స్టెప్పులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో అల్లు అర్జున్ అభిమానులు బాగా ఫీలవుతున్నారు. తమ హీరోతో నటించకుండా తారక్ తో నటిస్తోందంటూ వాపోతున్నారు. బహుశా ఆమె అడిగినంత పారితోషికాన్ని వారు ఇచ్చివుంటారంటున్నారు. వార్2ను రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

Shraddha Kapoor doing an item song with Jr NTR in War 2

తారక్ సినిమాలో విలన్ గా అమిర్ ఖాన్
ధూమ్ 4లో రణబీర్ కపూర్ సరసన హీరోయిన్ గా శ్రద్ధ నటిస్తోంది. అలాగే మరో భారీ బడ్జెట్ మూవీ నాగిని చేస్తోంది. మరోవైపు తారక్ వార్ 2 షూటింగ్ పూర్తిచేసిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఆగస్టు 14న వార్ 2 విడుదలవుతుంది. డిసెంబరు నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో తారక్ పాల్గొంటాడు. దీన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రతినాయక పాత్రను అమిర్ ఖాన్ పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైన అతి పెద్ద బ్లాక్ బస్టర్ న్యూస్ అవుతుందని తారక్ అభిమానులు అంటున్నారు. వీరిద్దరూ నటన పరంగా హోరాహోరీగా నటించగలిగే సత్తా ఉన్నవారే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+