పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తాట తీస్తా..నెటిజన్‌కు శృతి హాసన్ స్ట్రాంగ్ కౌంటర్
శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఇదే సమయంలో బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. దీనికి కారణం తన వ్యక్తిగత జీవితమే అంటోంది ఈ భామ. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది.

ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి మరోసారి ప్రేమలో పడింది. రెండేళ్లు అతనితో డేటింగ్ నడిపిన శ్రుతి హాసన్ ఇటీవలే అతనికి కూడా బ్రేకప్ చెప్పింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేస్తుంటుంది. తాజాగా అభిమానులతో ముచ్చటించిన శృతి హాసన్.. ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు తనదైనశైలిలో సమాధానం ఇచ్చింది. శృతి హాసన్‌ను ఓ నెటిజన్ సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా? అని అడగడం జరిగింది.
దీనిపై శృతి హాసన్ రియాక్ట్ అవుతూ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. '' ఓకే ఈ రకమైన జాతి వివక్షను అస్సలు సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్.. ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము ఊరుకోము. మీరు మమ్మల్ని అనుకరించలేరు. కాబట్టి మాలాగ ఉండాలని ట్రై చేయకండి. ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోము. సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లు'' అంటూ శృతి కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయింది. శృతి హాసన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications